తెలంగాణ

3న బీసీ సంఘాలతో సీఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 1: బిసిల అభ్యున్నతి కోసం 38 డిమాండ్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ముందు పెట్టాలని 14 బిసి సంఘాలు నిర్ణయించాయి. బిసి పార్లమెంటు సభ్యులు, బిసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ నెల 3న సమావేశం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య అధ్యక్షతన 14 బిసి సంఘాల నాయకులు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశంలో ఏయే డిమాండ్లను ముందు పెట్టాలన్న అంశంపై లోతుగా చర్చించి, 38 డిమాండ్లను నిర్ణయించారు. పారిశ్రామిక పాలసీలో బిసిలకు జనాభా ప్రకారం కోటా ఇవ్వాలని, బిసి పారిశ్రామిక పాలసీ ప్రకటించాలని నిర్ణయించారు. గ్రామాల్లో భూములు లేని బిసిలకు 3 ఎకరాలు ఇవ్వాలని, నామినేటెడ్ పోస్టుల్లో చైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్సీ, ఇతర పోస్టుల్లో 50 శాతం ఇవ్వాలని, వచ్చే ఎన్నికల్లో బిసిలకు 50 శాతం పార్లమెంటు, అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వాలని, కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్ళాలని, కులాంతర వివాహాలు చేసుకునే వారికి ఇస్తున్న ప్రోత్సాహక పారితోషికాన్ని 10 నుంచి రెండు లక్షల రూపాయలకు పెంచాలని, జూనియర్ అడ్వకేట్స్‌కు ఇచ్చే స్ట్ఫైండ్‌ను వెయ్యి నుంచి 10 వేలకు పెంచాలని తదితర డిమాండ్లను సీఎం ముందు పెట్టాలని నిర్ణయించారు.