తెలంగాణ

నేడు దివ్యాంగుల దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రాష్టస్థ్రాయి ఉత్సవాలను ఆదివారం రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుండి ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్రప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటవుతున్నాయి. పులువురు మంత్రులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, దివ్యాంగులు ఇతరులు పెద్ద ఎత్తున హాజరవుతున్నారు.
దివ్యాంగుల్లోని సాంకేతిక నిపుణులకు మంచి అవకాశం ఇచ్చేందుకు హైదరాబాద్‌లో ఐటి క్యాంపస్‌ను (ఐటి పార్క్) ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శనివారం అవగాహనా ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ప్రభుత్వం-వింధ్య ఇ-ఇన్‌ఫర్మేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని ఇందుకోసం 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఈ క్యాంపస్‌లో దివ్యాంగులకు శిక్షణ, నివాసం, డెలివరీ సెంటర్లు ఏర్పాటవుతాయి. వచ్చే ఐదేళ్లలో రెండువేల మందికి ఉపాధి లభిస్తుందని తెలంగాణ ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు.
ఇలా ఉండగా దివ్యాంగుల దినోత్సవానికి ముందు ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించేందుకు శనివారం హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు నుండి ఐమాక్స్ థియేటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు ఈటెల రాజేందర్, పట్నం మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగులకు 1500 రూపాయల పింఛన్ ఇస్తున్నామని, బడ్జెట్‌లో దివ్యాంగుల సంక్షేమానికి 33 కోట్ల రూపాయలు కేటాయించామని మంత్రులు వెల్లడించారు.