తెలంగాణ

సమ్మె విరమించిన సెర్ప్ ఉద్యోగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: గత 34 రోజులుగా చేస్తున్న సమ్మెను సెర్ఫ్ ఉద్యోగులు శనివారం విరమించారు. ఎంపి కె.కవిత ఆధ్వర్యంలో సెర్ప్ ఉద్యోగులు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో చర్చలు జరిపారు. ఇప్పటికే మంత్రి సెర్ప్ ఉద్యోగులతో రెండు దఫాలుగా చర్చలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ప్రతిష్టంభన నెలకొన్న ఐదు డిమాండ్లపై మంత్రితో చర్చించారు. ఈ డిమాండ్లను సిఎం కెసిఆర్‌కు వివరించామని ఆయన పరిశీలిస్తున్నారని, సానుకూల ఫలితం ఉంటుందని ఎంపి కవిత, మంత్రి జూపల్లి ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు నచ్చ చెప్పడంతో వారు ఎలాంటి షరతులు లేకుండా సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించినట్లు ఆయా వర్గాలు తెలిపాయి.