తెలంగాణ

జియో ఫిజికల్ రీసెర్చ్‌పై నేటి నుంచి సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: అడ్వాన్స్‌డ్ జియో ఫిజికల్ రీసెర్చ్‌పై ఈ నెల 3 నుంచి 7వ తేదీ వరకు స్ధానిక సిఎస్‌ఐఆర్-ఎన్‌జిఆర్‌ఐలో జాతీయ స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎన్‌జిఆర్‌ఐ తెలిపింది. భూకంపాల అధ్యయన శాస్త్రం (సిస్మోలజీ)కి సంబంధించి జియోఫిజిక్స్‌లో ఇటీవల వచ్చిన అడ్వాన్స్‌డ్ రీసెర్చ్‌పై 54వ సదస్సును నిర్వహిస్తున్నట్లు ఎన్‌జిఆర్‌ఐ తెలిపింది. భూకంపాలు, దానికి సంబంధించిన హానికర పరిణామాలు, భూగర్భ జల సంపద సహా భూ అంతర్భాగంలోని సహజ వనరుల గురించి లోతైన అధ్యయనం చేయడంలో జియోఫిజిక్స్‌లో జరిగిన, జరుగుతున్న అడ్వాన్స్‌డ్ రీసెర్చ్, సంబంధిత అంశాలను ఈ సదస్సు వేదికగా ప్రపంచానికి వెల్లడి చేసేందుకు నిర్ణయించినట్లు ఎన్‌జిఆర్‌ఐ వర్గాలు తెలిపాయి. ఈ సదస్సుకు దేశ వ్యాప్తంగా ఉన్న భూగోళ శాస్తవ్రేత్తలతో పాటు విదేశాల నుంచి పేరొందిన శాస్తవ్రేత్తలు, ఇతర ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు తెలిపారు. భూగోళ శాస్త్ర సంబంధిత అంశాలపై వీరంతా తమ తమ పరిశోధనల గురించి ఈ సందర్భంగా వెల్లడించనున్నారు. సిఎస్‌ఐఆర్ డైరక్టర్ జనరల్ డాక్టర్ గిరీశ్ సాహ్ని ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.