తెలంగాణ

14 నుంచి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: ఈ నెల 14 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ప్రసాద్, ఆర్.వెంకట్రాములు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 1000 మంది కూలీ సంఘం నేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారని వెల్లడించారు. శనివారం నాడిక్కడ వారు మహాసభల గోడపత్రికను ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా, కూలీ వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాయని విమర్శించారు. రేషన్ షాపుల రద్దు, ఆహార భద్రత చట్టానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. బలవంతంగా నగదు బదిలీని ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పని చేస్తున్న మేట్లను తొలగించడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. మేట్లను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 4న కలెక్టర్లకు, పిడిలకు వినతిపత్రాలు ఇవ్వాలని, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.