తెలంగాణ

ఏటేటా పెరుగుతున్న పైశాచికత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: హైదరాబాద్ మెట్రో నగరంలో మహిళల పట్ల మగాళ్లలో రోజురోజుకూ క్రూరత్వం పెరిగిపోతోంది. కట్టుకున్న భర్తలతోపాటు కుటుంబీకుల్లో సహితం క్రూరత్వం పెచ్చుమీరిపోతోంది. మహిళలను పలు హింసలకు గురిచేస్తున్న మగాళ్లపై సెక్షన్ 498ఏ ప్రయోగించినా ఫలితం లేకుండాపోతోంది. నేషనల్ క్రైమ్స్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ప్రకారం..దేశంలోని 19 మెట్రో నగరాల్లో హైదరాబాద్ సిటీ 1311 ఘటనలతో రెండో స్థానంలో ఉంది. 3645 ఘటనలతో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. మహిళల పట్ల మగాళ్ల క్రూరత్వం 1008 కేసులతో జైపూర్ మూడో స్థానంలో ఉండగా, 37 కేసులకే పరిమితమైన కోయంబత్తూర్‌లో పురుషులు మంచి మనుషులుగా ఎన్‌సీఆర్‌బీ రికార్డుకెక్కారు. అదేవిధంగా మెట్రో పాలిటన్ నగరాలైన అహ్మదాబాద్‌లో 562, బెంగళూరులో 489, చెన్నైలో 178, ఘజియాబాద్‌లో 481, ఇండోర్‌లో 275, కాన్పూర్‌లో 365, కొచ్చిలో 111, కోల్‌కటలో 886, లక్నోలో 895, నాగపూర్‌లో 248, ముంబయిలో 587, పాట్నాలో 405, పుణెలో 379, సూరత్‌లో 195 కేసులు కాగా, మొత్తం 12218 కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా మహిళల కిడ్నాప్ కేసుల్లో 3364 కేసులతో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ముంబయి 1142 కేసులతో రెండో స్థానంలో ఉండగా, బెంగుళూరు 674 కేసులతో మూడ స్థానంలో ఉండగా, కోయంబత్తూరులో కేవలం 4 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అహ్మదాబాద్‌లో 271, చెన్నైలో 15, ఘజియాబాద్‌లో 235, హైదరాబాద్‌లో 227, ఇండోర్‌లో 230, జైపూర్‌లో 377, కాన్పూర్‌లో 312, కొచ్చిలో 8 కేసులు నమోదు కాగా, కోల్‌కతాలో 120, లక్నోలో 601, నాగపూర్‌లో 368, పాట్నాలో 562, పుణెలో 578, సూరత్‌లో 162 కేసులు నమోదు కాగా, మొత్తం 9256 కేసులు నమోదైనట్టు సీఆర్‌బీ గణాంకాలు పేర్కొన్నాయి. అదేవిధంగా మెట్రోపాలిటన్ నగరాల్లో మొత్తం 4935 అత్యాచార కేసులు నమోదయ్యాయి. మహిళలపై అత్యాచారాల్లో 1996 కేసులతో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ముంబయి 712 కేసులతో రెండోస్థానంలో ఉంది. పుణెలో 354 కేసులు నమోదు కాగా కోయంబత్తూరులో ఎలాంటి కేసు నమోదు కాలేదు. అహ్మదాబాద్‌లో 112, బెంగుళూరులో 321, చెన్నైలో 25, ఘజియాబాద్‌లో 105, హైదరాబాద్‌లో 170, ఇండోర్‌లో 179, జైపూర్‌లో 330, కాన్పూర్‌లో 54, కొచ్చిలో 62, కోల్‌కటలో 15, కొజికోడ్‌లో 52, లక్నోలో 102, నాగపూర్‌లో 171, పాట్నాలో 54, సూరత్‌లో 121 కేసులు నమోదైనట్టు ఎన్‌సీఆర్‌బీ పేర్కొంది.