తెలంగాణ

మిలాద్-ఏ-నబీ ర్యాలీ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో శనివారం ‘మిలాద్-ఏ-నబీ’ ర్యాలీ ప్రశాంతంగా జరిగింది. పాతబస్తీలో సున్నీ, సూఫీ ముస్లింల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో లక్షలాది మంది ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దాదాపు 35 స్వాగత వేదికల వద్ద సున్నీ, సూఫీ ముస్లిం ప్రముఖులు ప్రసంగించారు. ఇస్లాం మత ప్రబోధకుడు, దైవ దూత మహమ్మద్ రసూల్-సల్లె-అలాహ్ సల్లం ఇస్లాం బోధనలను వారు కొనియాడారు. చాంద్రాయణగుట్ట, బార్కస్, పహాడీ షరీఫ్, మీరాలం మండి, లంగర్‌హౌజ్, చార్మినార్, పత్తర్‌గట్టి, రహెన్ బజార్, అలియాబాద్‌ల మీదుగా సాగిన ర్యాలీ మక్కామసీదు వరకు కొనసాగింది. వేలాది మంది ముస్లింలు వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడ జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొన్నారు. మిలాద్-ఏ-నబీ సందర్భంగా పాతబస్తీలో దాదాపు 3500 మంది సిబ్బందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రిజర్వ్డ్ ఆర్మ్డ్ ఫోర్స్, గ్రేహౌండ్స్, అశ్వ దళాలు బందోబస్తులో పాల్గొన్నాయి. శనివారం మధ్యాహ్నం గం. 2:00ల నుంచి సా.గం. 6:30 వరకు సాగిన ర్యాలీలో ఎక్కడ, ఎలాంటి సంఘటనలు చోటుచేసుకోకుండా, ప్రశాంతంగా ముగిసిందని సౌత్‌జోన్ డీసీపీ వి సత్యనారాయణ తెలిపారు. మిలాద్- ఏ-నబీ ర్యాలీకి పోలీసులకు ఎన్జీవో సంఘాలతోపాటు సహకరించిన అన్ని వర్గాల ప్రజలు, నాయకులకు డీసీపీ సత్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు.

చిత్రాలు..మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఏ-నబీ సందర్భంగా పాతబస్తీలో పండుగ వాతావరణం నెలకొంది. ఆబాలగోపాలం భక్తిప్రపత్తులతో ర్యాలీలో పాల్గొనడంతో చార్మినార్ పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయ.