తెలంగాణ

పరిహారం అందక ఆగిన నిర్వాసితుడి గుండె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, నవంబర్ 2: మిడ్ మానేరు ముంపు నిర్వాసితుడు ఒకరు పరిహారం కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి వేసారి అవి అందకుండానే మనస్తాపంతో గుండెపోటుకు గురై హఠాన్మరణం చెందాడు. కుటుంబ సభ్యు ల కథనం ప్రకారం... సిరిసి ల్ల రాజన్న జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన అవదూత బక్కయ్య (60)కు చెందిన ఇల్లు మధ్య మానేరులో ముంపు నకు గురవుతుండగా, 2008లో అవార్డు పాసై పరిహారం కోసం తిరుగుతున్నాడు. అయనా పరిహారం ఇప్పటికే తీసుకెళ్ళావని అధికారులు చెప్పడంతో అవాక్కయ్యాడు.
తాను ఎప్పుడు పరిహారం తీసుకున్నానో వివరాలు తెలపండని, అధికారుల చుట్టూ తిరుగుతున్నా అతనిని ఎవరూ పట్టించుకోలేదు. దీనితో పరిహారంపై బెంగ తీవ్రం కావడంతో మనస్తాపంతో మగ్గుతున్నాడు. గత ఆరు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా బక్కయ్యకు న్యాయం జరగడం లేదు. పైగా ఒకసారి నీ ఇల్లు నోటిఫైడే కాలేదని, మరోసారి పరిహారం ఎప్పుడో చెల్లించామని అధికారులు రకరకాలుగా చెప్పడంతో బక్కయ్య మనోవేదన మరింత తీవ్రమైంది. చీర్లవంచ గ్రామంలోని ఇంటి నెం.8-99ని 2008లో ముంపు నిర్వాసితుల కింద నోటిఫైడ్ చేశారు.
అప్పటి నుండి అధికారుల చుట్టూ తిరగడంతో పాటు కలెక్టర్‌కు, జాయింట్ కలెక్టర్‌కు సైతం విన్నవించుకున్నా ఫలితం లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పరిహారం అందకపోగా, పరిహారం తీసుకెళ్ళావని అధికారులు బుకాయించడంతో, మరింత కుంగిపోయిన బక్కయ్యకు మనోవేదన మధ్య గుండెపోటు రావడంతో శనివారం తెల్లవారే వరకే మృత్యువాతకు గురయ్యాడన్నారు. కాగా, మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.