తెలంగాణ

నృత్య దర్శకుడు ధర్మరాజుకు ప్రభుదేవా శ్రద్ధాంజలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నస్రుల్లాబాద్, డిసెంబర్ 2: ప్రము ఖ నృత్య దర్శకుడు ధర్మరాజు (90) శనివారం కామారెడ్డి జిల్లా నస్రుల్లా బాద్ మండలం అంకోల్ గ్రామంలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన గత 40 ఏళ్లుగా సినీ పరి శ్రమలో విశిష్టమైన సేవ లందిస్తు న్నా రు. కొంతకాలం నుండి ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించి శనివారం ఆయన స్వర్గస్థులయ్యారని కుటుంబ సభ్యు లు తెలిపారు. ఈ విషయం తెలు కు న్న ప్రముఖ డ్యాన్సర్, నటుడు, ధర్మరాజు శిష్యుడు ప్రభుదేవా అంకోల్ గ్రామానికి చేరుకొనిభౌతి కకాయంపై పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించి, గురువు కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చారు. ధర్మరాజు శిష్యరికంలో తాను మంచి డాన్సర్‌ను కాగలిగానని ఈ సందర్భంగా ప్రభుదేవా గుర్తు చేసుకున్నారు. ధర్మరాజు మృతితో మంచి గురువును, నృత్యకారుడిని పోగొట్టుకున్నామన్నారు. ధర్మరా జు జీవితాంతం కళారంగానికి సేవలందించారని చెప్పారు. ఇదిలావుండగా, ధర్మరాజు మృతితో అంకోల్ గ్రామం లో విషాదఛాయలు అలుముకున్నాయి.
మిత్రులు, సినీరంగ ప్రముఖులు, నృత్యకళాకారులు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు తరలివస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.