తెలంగాణ

డీడీ కట్టేందుకు గడువివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: డిసెంబర్ నెల రేషన్ సరుకుల కోసం డిడిలు కట్టేందుకు గడువు ఇవ్వాలని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు పౌరసరఫరాల మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ సివి ఆనంద్‌ను కోరారు. తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయడంతో పాటు డిడిలు ఇంకా కట్టని వారికి కొంత సమయం ఇవ్వాలని కోరారు. ఇందుకు మంత్రి, కమిషనర్ సానుకూలంగా స్పందించారని రాజు తెలిపారు. డిడి లు కట్టిన తర్వాత ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని డీలర్ల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర అధ్యక్ష పదవికి, డీలర్‌షిప్‌కు రాజీనామా చేస్తానని చెప్పినట్లు ఆయన వివరించారు. సిఎం కెసిఆర్ తమ సమస్యలు పరిష్కరిస్తారన్న నమ్మకం ఉందని అన్నారు. డీలర్లలోని ఓ వర్గం వారు డీలర్లకు నష్టం కలిగించే విధంగా పని చేస్తున్నారని అన్నారు. చాలీ చాలని కమిషన్‌తో డీలర్లు కాలం వెళ్లదీస్తున్నారని, ప్రభుత్వం స్పందించాలని విజ్ఞప్తి చేశారు.