తెలంగాణ

రైతుల రుణ మాఫీకోసం మా పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: రైతుల రుణ మాఫీ విషయంలో వడ్డీ మాఫీ పూర్తిగా జరిగేంత వరకూ తమ పోరాటం ఆగదని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. రుణ మాఫీ విషయంలో వడ్డీ మాఫీ చేయకపోవడంతో రైతులు అనేక కష్టనష్టాలకు గురవుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో డిసిసి అధ్యక్షులు, ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రసంగిస్తూ రైతుల రుణ మాఫీపై వడ్డీ మాఫీ కాకపోవడం గురించి అసెంబ్లీ సమావేశాల్లో గట్టిగా నిలదీయడంతో ప్రభుత్వం దిగి వచ్చి జిల్లాల్లో రుణ మాఫీపై వడ్డీ మాఫీ సమాచారాన్ని సేకరిస్తున్నదని చెప్పారు. కాబట్టి రెండు రోజుల్లో కాంగ్రెస్ శ్రేణులు జిల్లా వ్యవసాయ అధికారులను, కలెక్టర్లను కలిసి సమగ్ర సమాచారం అందించాలని ఆయన సూచించారు. మార్కెట్లలో వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని, మార్కెట్లను కాంగ్రెస్ నాయకులు సందర్శించి రైతులతో చర్చించాలని సూచించారు. పత్తి సిసిఐ వారు కొనుగోలు చేయడం లేదని, మొక్క జొన్నలు మార్క్‌ఫెడ్ కొనుగోలు చేయడం లేదని ఆయన తెలిపారు.