తెలంగాణ

బీజీ-3 పత్తి విత్తనాలపై ఉక్కుపాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: బిజి-3 (బోల్‌గార్డ్-3/బిటి-3) పత్తివిత్తనాల వ్యవహారంలో ఉక్కుపాదం మోపాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దాంతో అప్రమత్తమైన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ద చూపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అధీనంలోని జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రూవల్ కమిటీ (జిఇఎసి) అనుమతి లేకుండా ఎలాంటి పత్తివిత్తనాలను మార్కెట్లోకి విడుదల చేసేందుకు వీలులేదు. ఏ సంస్థ అయినా కొత్తగా పత్తివిత్తనాలు మరీ ముఖ్యంగా జన్యుమార్పిడి ద్వారా (జెనెటికల్లీ మోడిఫైడ్-జిఇ) విత్తనాలను విడుదల చేయాలనుకుంటే జిఇఎసి అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. తొలుత ఈ విత్తనాలు మనుషుల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయో అధ్యయనం చేస్తారు. రైతులకు, ఇతరులకు, పశువుల ఆరోగ్యానికి ఎలాంటి హానీ ఉండదని, ఇతర పంటలపై ఎలాంటి దుష్ప్రభావం పడదని పరిశోధనల్లో తేలితేనే జిఇఎసి కొత్త పత్తివిత్తనాలకు అనుమతి మంజూరు చేస్తుంది. శాస్తవ్రేత్తలు, రైతులు తదితరులతో సమగ్రంగా చర్చ జరిగిన తర్వాతనే జిఇఎసి కూడా అనుమతులు ఇస్తుంది. అయితే జెనెటికల్లీ మోడిఫైడ్ (జిఎం) పత్తికి సంబంధించి అమెరికాకు చెందిన మోన్‌శాంటో ఇప్పటికే బిటి-1, బిటి-2 పత్తివిత్తనాలను భారత్‌లోని వేర్వేరు రాష్ట్రాల్లో విడుదల చేసింది. మన దేశంలో వేర్వేరు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో బిటి-1, బిటి-2 పత్తివిత్తనాలపై అధ్యయనం చేశారు. వీటి విడుదల సందర్భంగా అనేక సంస్థలు అభ్యంతరం తెలిపాయి కూడా. కేవలం పత్తిలోనే కాకుండా వంకాయ, తదితర కూరగాయల్లో కూడా జన్యుమార్పిడి ద్వారా అభివృద్ధి చేసిన విత్తనాలను విడుదల చేసేందుకు జరిగిన ప్రయత్నాలను రైతు సంఘాలు, ఎన్‌జిఓలు పెద్ద ఎత్తున వ్యతిరేకించాయి. పరిశోధనా ఫలితాలను దృష్టిలో ఉంచుకుని బిజి-1, బిజి-2 పత్తివిత్తనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే అనుమతించాయి. ప్రస్తుతం బిటి-2 పత్తి విస్తారంగా వేస్తున్నారు. తెలంగాణలో 2017 ఖరీఫ్ సందర్భంగా 49 లక్షల ఎకరాల్లో పత్తివేయగా, 90 శాతం విస్తీర్ణంలో బిటి-2 సాగయింది. ఈ పరిస్థితిలో బిజి-3 కూడా మార్కెట్లోకి వచ్చిందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణతోపాటు మహారాష్టల్రో కూడా కొన్ని ప్రాంతాల్లో బిజి-3 వేశారని సమాచారం అందింది. ఈ అంశం తెలంగాణ ప్రభు త్వం దృష్టికి ఇటీవల రాగానే ఒక కమిటీని వేసిం ది. అనుమానిత ప్రాంతాల్లో విత్తనాల నమూనాలను సేకరించి, పరీక్షించగా, బిజి-3 లక్షణాలు ఉన్నట్టు ధృవీకరణ అయింది. ఈ అంశంపై క్షేత్ర తనిఖీ, శాస్ర్తియ విశే్లషణ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
కలుపు నివారిణి రోగ నిరోధక శక్తి పేరుతో బిజి-3 (హెచ్‌టి, రౌండ్ రెడీ ఫ్లెక్స్-ఆర్‌ఆర్‌ఎఫ్) విత్తనాలను అక్రమంగా విక్రయించారని ధృవీకరించారు.
దాంతో ఈ రకం విత్తనాలను ఉత్పత్తి చేసిన వారితో పాటు అమ్మే డీలర్లు, రిటైల్ వ్యాపారుల, సాగు చేసే రైతులపై కూడా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంశంపై నిరంతరం నిఘా ఉంటుందని వెల్లడించారు.