తెలంగాణ

పన్ను చెల్లించకుంటే చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: వచ్చే వారం అసెం బ్లీ సమావేశాల్లో పంచాయతీ రాజ్ ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టేందుకు రాష్ట్రప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ బిల్లుకు న్యాయ నిపుణులు తుది మెరుగులు దిద్దుతున్నారు. చట్టంలో లోపాలకు తావులేకుండా పటిష్టంగా రూపొందిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పంచాయితీ రాజ్ చట్టం రూపకల్పనలో అనుభవం ఉన్న నిపుణులు, గ్రామ పరిపాలనలో ప్రవేశం ఉన్న సీనియర్లు, అధ్యయన వేత్తల నుంచి సలహాలను ప్రభుత్వం స్వీకరించింది. ఇతర రాష్ట్రాల్లో గ్రామీ ణ పరిపాలన రంగంపై కూడా మన రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు అధ్యయనం చేసి వచ్చారు. ఈ బిల్లులో కొన్ని కొత్త అంశాలు ఉండబోతున్నాయి. పన్ను వసూళ్లను నూటికి నూరు శాతం పూర్తి చేయాలి. గ్రామంలో ప్రజల ను అభివృద్ధిలో సంపూర్ణగా భాగస్వామ్యం చేస్తా రు. వారానికి ఒకసారి శ్రమధానం కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో ప్రజలు పాల్గొనాలి. పాఠశాలలు, ఆసుపత్రులు, అంగన్‌వాడీలు, ఇతర ప్రభుత్వ సంస్ధల నిర్వహణ తీరును పర్యవేక్షించేందుకు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తారు. గ్రామాల్లో పన్నులు చెల్లించేవారు తక్కు వే. దీని గురించి అవగాహన కూడా అంతంత మాత్రమే. కొత్త చట్టం అమలులోకి వస్తే గ్రామ ప్రజలు తప్పనిసరిగా అన్నిరకాల పన్నులను చట్టంలో నిర్దేశించినట్లుగా చెల్లించేవిధంగా చర్య లు తీసుకోనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. పన్నులు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు ఉంటాయి. కొత్త గ్రామ పంచాయితీల ఏర్పాటు, వీటిల్లో స్వయం సహాయక బృందాల పాత్రను కూడా చట్టంలో నిర్దేశించనున్నారు. గ్రామాల్లో చెరువులు, ప్రభుత్వ ఆస్తులు, ఇతర ప్రజా ఆస్తుల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోనున్నారు. రాష్ట్రప్రభుత్వం నుంచి నేరుగా నిధు లు పంచాయితీలకు బదలాయించడం, ఆ నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కొత్త చట్టంలో ప్రతిపాదించనుంది. ఒక్కో గ్రామ పంచాయితీకి జనాభా ప్రాతిపదికపై రూ.10 నుంచి రూ.25 లక్షల మేర నిధులను ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు బదలాయిస్తుందని, గ్రామ స్వరాజ్యం సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అసెంబ్లీలో ప్రకటించిన విషయం విదితమే.