తెలంగాణ

నేటి జర్నలిస్టులకు దిక్సూచి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, డిసెంబర్ 3: తన ఆలోచన విధానాలకు అనుగుణంగా పట్టుదలతో పుస్తకాన్ని రచించిన ప్రొఫెసర్ సివి. నర్సింహారెడ్డి రచించిన పుస్తకం నేటి తరం జర్నలిస్టులకు దిక్సూచిలా నిలుస్తోందని పలువురు వక్తలు కొనియాడారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సివి నర్సింహారెడ్డి రచించిన ‘డిక్షనరీ ఆఫ్ కమ్యూనికేషన్స్ - పబ్లిక్ రిలేషన్స్ జర్నలిజం అండ్ మీడియా స్టడీస్’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీపీ ఎస్‌సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి, మాజీ ఐఏఎస్ అధికారి నరేందర్ లూథర్, ప్రొఫెసర్ బీపీ. సంజయ్‌లు పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రచయిత నర్సింహారెడ్డి ఫాదర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ కాకుండా గ్రాండ్ ఫాదర్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అనడం ఉత్తమమని అన్నారు. వయస్సులో పెద్దవాడైనా ఇంకా ఇంతో ఉత్సాహంగా, చలాకీగా రచనలు చేయడం నర్సింహారెడ్డికే చెల్లుబాటు అయిందని అన్నారు. జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ రంగాల్లో రాణించాలనుకునే వారికి ఇది ఒక మార్గదర్శిగా ఉపయోపడుతుందని వారు పేర్కొన్నారు. సమాజంలో మీడియా పాత్ర ఎం తో కీలకమని, వీటిలో రాణించాలంటే వ్యిక్తిత్వ వికాసం ఎంతో అవసరమని అన్నారు. నర్సింహారెడ్డి పీఆర్, జర్నలిజంలోకి వచ్చే వారికి ఎంతగానో దోహదపడుతుందని రామచంద్రమూర్తి అన్నారు. నర్సింహారెడ్డి తన అనుభవజ్ఞమైన ఆలోచనలతో పబ్లిక్ రిలేషన్స్‌పై డిక్షనరీని తీసుకురావడం అభినందనీయమని అన్నారు.