తెలంగాణ

కాశీలో తెలుగు ఆధ్యాత్మిక వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీలో తెలుగు ఆధ్యాత్మిక శోభ వెల్లివిరుస్తోంది. విశాఖ శ్రీశారదాపీఠం తమ శాఖ భవనాన్ని ఏర్పాటు చేసింది. శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతీ మహాస్వామి ఈ భవనాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ భవనంలో రోజూవారీ పూజలతో పాటు అన్నదానం కూడా ప్రారంభించారు. పీఠం నిర్వహకులు, ట్రస్టీలతో పాటు కాశీ (వారణాశి) లోని దండీ స్వాములకు యతిభిక్ష ప్రారంభించారు. కాశీ క్షేత్రంలో ఒక యతికి భిక్షపెడితే సహస్ర (వెయ్యి) మంది వేదపండితులకు భిక్ష పెట్టినంత ఫలితం వస్తుందని ఈ సందర్భంగా స్వరూపానందేంద్ర తెలిపారు. స్వరూపానందేంద్ర ఈ సందర్భంగా కాశీ విశే్వశ్వరుడిని, విశాలాక్షిని, అన్నపూర్ణాదేవిని దర్శించారు. దత్తజయంతి సందర్భంగా కాశీలోని శ్రీశారదాపీఠంలో ప్రారంభమైన అన్నదాన కార్యక్రమంలో శారదాపీఠం ట్రస్టీ రొబ్బి శ్రీనివాస్, ధర్మాధికారి జి. కామేశ్వర శర్మ, ఆస్థాన పం డితుడు కృష్ణశర్మ, కాశీ శాఖ భవనం మేనేజర్ పి. కిషోర్‌కుమార్, ఆంధ్రాఆశ్రమం మేనేజింగ్ ట్రస్టీ వివి సుందరశాస్ర్తీ, వివి సీతారామం, కిరివేన సత్రం మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.