తెలంగాణ

మరొకరిపైనా ఔషధ ప్రయోగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుజూరాబాద్, డిసెంబర్ 3: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఆదివారం వెలుగులో కి వచ్చిన ఔషధ ప్రయోగం సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. పట్టణంలోని ఒక గ్యాస్ గోదాం ఏరియాలో నివాసముండే ఎర్ర దేవిప్రసాద్ (30) అనే వ్యక్తి తనపై ఔషధ ప్రయోగం జరిగిందని వెల్లడించాడు. 2006 నుండి 2009 వరకు తాను హైదరాబాద్‌లో ఉన్నానని, అదే సమయంలో తనపై పలు కంపెనీలు ఔషధ ప్రయోగం చేసాయని అతను వెల్లడించాడు. కానీ అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. అయతే, తన చికిత్సకు సంబంధించిన ప్రిస్క్రిప్షన్‌లను మాత్రం బయటపెట్టాడు. తాను రక్తహీనతతో బాధపడుతున్నట్లు వెల్లడించాడు. కాగా, దేవిప్రసాద్ చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఎంజీఎంకు వెళ్లినట్లు తెలుస్తోంది. శనివారం జమ్మికుంట మండలం కొత్తపల్లిలో ఔషధ ప్రయోగం వార్త వెలుగుచూడగా ఇదే మండలంలో కొద్ది నెలల క్రితం కూడా ఓ వ్యక్తిపై ఔషధ ప్రయోగం విషయం సంచలనం కలిగించిన విషయం తెలిసిందే.

చిత్రం..తనపై కూడా ఔషధ ప్రయోగం జరిగిందని హుజూరాబాద్‌లో ఆదివారం వెల్లడిస్తున్న
బాధితుడు ఎర్ర దేవిప్రసాద్