తెలంగాణ

గల్ఫ్ బాధితులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 3: జీవనోపాధికోసం గల్ఫ్ దేశాలను వలస వెళ్లి, అక్కడ చిక్కుకున్నవారిని తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. ఆదివారం విహెచ్ విలేఖరులతో మాట్లాడుతూ తెలుగు మహాసభలు ఘనంగా నిర్వహిస్తామని చెబుతున్న తెలంగాణ ప్రభుత్వం, ముందు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్నవారి సమస్యలకు పరిష్కారం చూపాలని హితవు పలికారు. ఇటీవల గల్ఫ్ దేశాలలో పర్యటించానని, అక్కడ తెలంగాణకు చెందిన వేలాదిమంది అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి సమస్యలపై రాష్ట్ర మంత్రి కే.టీ. రామారావుకు లేఖ రాస్తే, ఇప్పటివరకు స్పందన లేదని పేర్కొన్నారు. తెలుగు మహాసభల సన్నాహక సదస్సు కొరకు దుబాయ్‌కి వెళ్లిన ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణకు అక్కడ చేదు అనుభవం ఎదురైందని ఆయన పేర్కొన్నారు. సమస్యలు ఎదుర్కొంటున్న తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాలకృష్ణను అక్కడ నిలదీశారని వెల్లడించారు. గల్ఫ్ దేశాల్లో తెలంగాణకు చెందినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని, మోసపోయిన వారిని ఇంటికి పంపించే కార్యక్రమం మాత్రమే ప్రభుత్వం చేస్తోందని, వారికి ఆర్థిక సహాయం కూడా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.