తెలంగాణ

రామ మందిరాన్ని నిర్మించి తీరుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దపల్లి రూరల్, డిసెంబర్ 3: అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టి తీరుతామని భజరంగ్‌దళ్ జాతీయ కన్వీనర్ మనోజ్ వర్మ స్పష్టం చేశారు. హిందువులు దేవతగా పూజించే గోవులను రక్షించుకోవడానికి, దేశంలో కొనసాగుతున్న గోహత్యకు వ్యతిరేకంగా పోరాడుదామని ఆయన పిలుపునిచ్చారు.
హిందు మతం, సంస్కృతిని కాపాడుకుంటూ దేశ విచ్ఛిన్నకర శక్తుల కుట్రలను భగ్నం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి రూరల్ మండలంలోని రాఘవాపూర్ గ్రామ సమీపంలో గల రెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఆదివా రం విశ్వహిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో భజరంగ్‌దళ్ భర్తీ అభియాన్ పేరుతో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో భజరంగ్ దళ్‌ను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామం లో నిరంతర కార్యక్రమాలు చేపడుతూ 25 మంది పటిష్టమైన సభ్యులను తయారు చేసుకోవాలన్నారు. వాక్ స్వాతం త్య్రం పేరుతో దేశ భద్రతకు ముప్పువాటిల్లే చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదన్నారు. యూనివర్శిటీలలో దేశ విచ్ఛిన్నకర శక్తులు చేస్తున్న కుట్రలను ఛేదించాలని, చరిత్రను వక్రీకరించే పద్మావతి వంటి సినిమాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. పలుచోట్ల నిర్మించనున్న గోవధశాల నిర్మాణాలను అడ్డుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో భజరంగ్‌దళ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రావ్, ప్రధాన కార్యదర్శి రాజేందర్‌రెడ్డి, భజరంగ్‌దళ్, వీహెచ్‌డపీ నాయకులు ఇసంపల్లి వెంకన్న, సుభాష్ చందర్, రాజు, శ్రీనివాస్, రాపర్తి గోపి, చాడ అశోక్ రెడ్డి, రాజ్‌కుమార్, గోపు మోహన్‌తో పాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి, నాయకులు పల్లె సదానందం, పిన్నింటి రాజు, కర్ర సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..పెద్దపల్లి మండలం రాఘవాపూర్ గ్రామ సమీపంలో ఆదివారం నిర్వహించిన
సమావేశంలో మాట్లాడుతున్న బజరంగ్‌దళ్ జాతీయ కన్వీనర్ మనోజ్ వర్మ