తెలంగాణ

సీపీ గ్రూపు నక్సలైట్ల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏటూరునాగారం, డిసెంబర్ 3: చంద్రపుల్లారెడ్డి (సీపీ) బాట పేరుతో చందాలు వసూళ్ళే ధ్యేయంగా ఏర్పడిన సీపీఐ (ఎంఎల్) సీపీ దళ సభ్యులను ఆదివారం అరెసు టచేసి రిమాండుకు తరలించినట్లు ఏటూరునాగారం ఏఎస్పీ రాహుల్‌హెగ్డే విలేఖరులకు తెలిపారు. ఆదివారం ఇక్కడి తన కార్యాలయంలో సీపీఐ (ఎంఎల్) సీపీబాట దళ సభ్యులు ధర్మారపు యాకయ్య అలియాస్ మోహన్, డర్రా అశోక్ అలియాస్ శ్రీకాంత్, కావిరి నర్సింగరావు అలియాస్ దిలీప్ అరెస్టును చూపారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ పాత నేర చరిత్రను అనుభవంగా తీసుకుని మళ్ళీ కాంట్రాక్టర్లు, బడా వ్యాపారులను లక్ష్యంగా ఎంచుకుని 2017 జూలై 24న కరీంనగర్‌కు చెందిన మాజీ జనశక్తి రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన కూర రాజన్న, నల్గొండ జిల్లాకు చెందిన బొమ్మని నర్సింహులు అలియాస్ విశ్వనాధం అలియాస్ ఆనంద్ నేతృత్వంలో సీపీఐ (ఎంఎల్) సీపీబాట ఆవిర్భవించిందన్నారు. వీరి నేతృత్వంలో జయశంకర్ జిల్లా భూపాలపల్లిలో 12 మందితో దళాన్ని ఏర్పాటు చేసుకుని భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో 4 దళాలను ఏర్పాటు చేసి, ఒక్కో దళంలో నలుగురు సభ్యులతో ఆయా జిల్లాలలోని మండలాలను కలుపుతూ దళాలలను ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా జయశంకర్ జిల్లాలోని ఏటూరునాగారం, మంగపేట ఏరియాల దళ సభ్యులుగా యాకయ్య, అశోక్, నర్సింగరావులు తుపాకులతో తిరుగుతూ, మంగపేట-ఏటూరునాగారం ప్రాంతాలలో రోడ్లపై ఇటీవల సీపీబాట పేరుతో కరపత్రాలు చల్లడం, వాల్‌పోస్టర్లను అంటించిందన్నారు. కాగా, మం గపేట మండలం నర్సింహసాగర్ అటవీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ఖాకీ చొక్కాలు ధరించి సమావేశం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు ఏటూరునాగారం సీఐ రఘుచందర్, మంగపేట ఎస్సై మహేందర్ యాదవ్ సీఆర్‌పీఎఫ్ బలగాలతో సమావేశ ప్రాంతానికి చేరుకునేలోపు, గమనించిన దళ సభ్యులు పారిపోతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటకు వచ్చిందన్నారు. వారివద్దనుండి రెండు ఎస్‌బీబీఎల్ తుపాకులతోపాటు 82 బుల్లెట్లు, రెం డు 8 ఎంఎం తుపాకులతోపాటు 122 బుల్లెట్లు, 20 ఎస్‌ఎల్‌ఆర్ బుల్లెట్లు, 5 ఖాళీ బుల్లెట్ల మ్యాగ్జై న్లు, 6 కిట్ బ్యాగులు, 7 సెల్ ఫోన్‌లు, 2 సెల్ పవర్ బాక్స్‌లు, 2 గ్రెనేడ్స్‌తోపాటు రూ.6500 నగదు, విప్లవ సాహిత్యం లభ్యమయ్యాయని తెలిపారు.
భూ సెటిల్‌మెంట్లు, చందాల వసూలే లక్ష్యం: ఏఎస్పీ రాహుల్‌హెగ్డే
గత ఆరు నెలలుగా సీపీబాట జిల్లా కమిటీ సభ్యుడు యాక య్య, మంగపేట దళం డిప్యూటీ కమాండర్ అశోక్, దళ సభ్యు డు నర్సింగరావులు పలు ప్రాంతాలలో సంచరిస్తూ, పోడు భూముల తగాదాలు, కుటుంబ తగాదాలు, ఇతర భూ తగాదాలను నిర్వహిస్తూ డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా సీపీఐ (ఎంఎల్) సీపీబాట ఏర్పడిందని వ్యాఖ్యానించారు. ఓ ఫర్టిలైజర్ యజమానిని రూ. 2లక్షలు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడినట్లు వెల్లడైందన్నారు.

చిత్రం..సీపీ బాట దళసభ్యుల అరెస్టును చూపుతున్న ఏఎస్పీ