తెలంగాణ

వాగ్దానాల వీరుడు ఆచరణలో శూన్యుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగర్‌కర్నూల్, డిసెంబర్ 3: ముఖ్యమంత్రి కేసీఆర్ వాగ్ధానాల వీరుడని, ఆచరణలో శూన్యుడని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్.జైపాల్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభకు ముఖ్య అతిధిగా హాజరైన ఆయన మాట్లాడు తూ ఎన్నికలు సమీపిస్తున్నందున కేసీఆర్ కొత్త వాగ్ధానాలకు శ్రీకారం చుట్టారని అన్నారు. సోనియాగాంధీ త్యాగం వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ నాడు తనతో స్వయంగా చెప్పారని అన్నా రు. తాను 45 ఏళ్లుగా ఎమ్మెల్యే, ఎంపీలతోపాటు వివిధ హోదాలలో పనిచేశానని, దేశంలో ఇలాంటి నాయకున్ని ఎక్కడా చూడలేదన్నారు. కేసీఆర్ మొసాలలో మొనగాడని విమర్శించారు. గొర్రె లు, చేపల పంపిణీ పథకాలలో జరుగుతున్న మోసాలను గ్రహించాలన్నారు. రాష్ట్రంలో ఏ సామాజిక వర్గం సంతృప్తిగా లేదన్నారు. దళితుడిని సీఎం చెస్తానని చెప్పిన కేసీఆర్ ఆ హామీని తుంగలో తొక్కారని, కనీసం దళితులకు చోటు కల్పించలేదన్నారు. టీఆర్‌ఎస్‌లో అవినీతి పెరిగిపోయిందని, దీనికి నీటిపారుదల ప్రాజెక్టులను ఆంధ్రవారికి కట్టబెట్టడమే నిదర్శనమన్నారు. కాంగ్రెస్‌కు దేఖో....కేసీఆర్‌ను ఫేకో అంటూ వ్యాఖ్యా నించారు. బీసీలను మచ్చిక చేసుకోవడానికే సబ్‌ప్లాన్, ప్రత్యేక పథకాలంటూ కేసీఆర్ కొత్త రాగం అందుకున్నారని, వీరి సంక్షేమమే ఆశించి ఉంటే అధికారంలోకి వచ్చిన తొలి రోజులలో ఎందుకు చేపట్టలేదని ఆయన ప్రశ్నించారు. కేవలం ఎన్నికలలో బీసీలను మభ్యపెట్టడానికే నేడు బీసీల రాగం పాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మహా సముద్రంలాంటిదని, ఎన్నో ఉప నదులు వచ్చి ఇందులో కలుస్తాయని, దీనికి టీడీపీ నేత రేవంత్‌రెడ్డి చేరికే ఒక ఉదాహరణ అన్నా రు. రాబోయే రోజులలో మరిన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఉంటాయన్నారు. కేసీఆర్‌ను ఓడించడం తక్షణ అవసరమన్నారు.
దేశంలో మోదీకి అందరికంటే దగ్గరి మిత్రుడు కేసీఆర్ అన్నారు. గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుం టోందని, అక్కడ అధికారం చేజిక్కించుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ అధికారంలో రావడం తమ లాంటివారికి ద్వేషం లేదని, కానీ, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడమే బాధ కలిగిస్తోందన్నారు.

చిత్రం..నాగర్‌కర్నూల్‌లో ప్రజాగర్జన బహిరంగ సభలో మాట్లాడుతున్న కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి