తెలంగాణ

లంబాడీలు వర్సెస్ ఆదివాసీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబాబాద్, డిసెంబర్ 3: మహబూబాబాద్ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా కేంద్రంలోని గాంధీపార్కులో ఆదివారం ఓవైపు ఆదివాసీలు, మరోవైపు లంబాడీలు పోటాపోటీగా బహిరంగసభలకు ఏర్పాట్లు చేశారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలంటూ ఆదివాసీలు డిమాండ్ చేస్తూ బహిరంగసభ ఏర్పాటు చేసుకోగా లంబాడీ హక్కుల ఆత్మగౌరవ సభ పేరుతో లంబాడీలు పెద్ద ఎత్తున అదే వేదికపై బహిరంగసభకు ఏర్పాట్లు చేశారు. లంబాడీలు, ఆదివాసీలు ఒకే వేదిక వద్ద బహిరంగసభకు ఏర్పాటు చేసుకోవడం ఉద్రిక్తత పరిస్థితుల నెలకొన్నాయి. దీంతో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మహబూబాబాద్ పట్టణంలో 144 సెక్షన్ విదిస్తూ ఆదేశాలు జారీచేశారు. లంబాడీలకు, ఆదివాసీల సభకు అనుమతి లేదంటూ పోలీసులు ఎక్కడివారిని అక్కడే అడ్డుకొని అరెస్ట్‌లు చేశారు. మానుకోట, పట్టణ శివారులో ఎక్కడ చూసినా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. సభకు వచ్చేవారందరినీ ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రైల్వేస్టేషన్‌లలో, బస్టాండ్‌లలో తనిఖీలు చేసి అరెస్ట్‌లు చేశారు. మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఆదివాసీలు, లంబాడీలు బహిరంగసభలకు బయలుదేరి వస్తుండగా పోలీసులు వారిని అడ్డుకొని ప్రత్యేక వాహనాల్లో సమీప పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ముత్యాలమ్మగూడెం వద్ద బయ్యా రం, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుండి వస్తున్న వేలాది మంది ఆదివాసీలను అడ్డుకోవడంతో పోలీసులకు, ఆదివాసీలకు మద్య వాగ్వాదం జరిగింది. సభకు అనుమతి లేదంటూ పోలీసులు ఆదివాసీలను అడ్డుకోగా తాము సభ జరుపుకోవడానికి అనుమతి ఉందంటూ ఆదివాసీలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా ఆదివాసీలను అరెస్ట్‌లు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆదివాసీ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు లంబాడీ ఆత్మగౌరవసభకు వస్తున్న వేలాది మంది గిరిజనులను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కేంద్రంలోని మహబూబాబాద్, రూరల్, కురవి, మరిపెడ, గూడూరు, తొర్రూరు, పోలీస్ స్టేషన్‌లకు తరలించారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివాసీ బహిరంగసభ, లంబాడీ ఆత్మగౌరవ సభ నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేపట్టారు. ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల నుండి ప్రత్యేక బలగాలను రప్పించారు. వందలాది మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిత్రం..రోడ్డుపై బైఠాయించిన ఆదివాసీలను అరెస్ట్ చేసి గూడూరు స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు