తెలంగాణ

కుట్రలను తిప్పికొట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, డిసెంబర్ 3: సమైక్య పాలనలో తెలంగాణలోని విద్యుత్‌రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాడితే తెలంగాణ చీకటిగా మారుతుందని కుట్రదారులు సృష్టించిన భయాందోళనలను తిప్పికొట్టేలా రాష్ట్రంలో రెప్పపాటు కూడ కోతలు లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ది శాఖల మంత్రి గుం టకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. మరింత మెరుగైన రీతి లో సరఫరాను మెరుగుపర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
సూర్యాపేట మున్సిపల్ పరిధిలో విద్యుత్ సరఫరా వ్యవస్థను ఆధునీకరించేందుకు రూ.7.95 కోట్ల వ్యయంతో చేపట్టే సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం పనులకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటుకు ముందు విద్యుత్‌రంగంపై అనేక అపోహలు సృష్టించే యత్నాలు చేశారని, వీటన్నిటినీ తిప్పికొట్టేందుకు సీఎం కేసీఆర్ విద్యుత్‌రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహించి రాష్ట్రంలో గృహ, పారిశ్రామికరంగాలకు రెప్పపాటు సైతం కోతలు లేకుండా విద్యుత్‌ను అందిస్తున్నామని, అంతేకాకుండా వ్యవసాయరంగానికి సైతం 24 గంటల విద్యుత్‌ను అందిస్తూ దేశంలోనే రికార్డు సాధించామన్నారు. వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే ప్రభు త్వ సంకల్పమన్నారు. దశబ్దాలుగా నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యుత్ లైన్‌లన్నీ అస్తవ్యవస్తంగా మారాయని, దీంతో సరఫరాలో కొంతమేర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అలాంటి వాటన్నింటినీ పరిష్కరించేందుకు గాను జిల్లాలో ఐపీడీఎస్ పథకం కింద రూ. 18.54 లక్షలతో జిల్లా పరిధిలోని సూర్యాపేట, కోదా డ, హుజూర్‌నగర్ మున్సిపాలిటీల పరిధిలో పనులు చేపడుతున్నామన్నారు. 8 మాసాల్లో ఈ పనులను పూర్తిచేసి మరింత నాణ్యమైన సేవలు అందించనున్నట్లు తెలిపారు. సూర్యాపేట మున్సిపాలిటీలో రూ.7.93 లక్షలతో ఆధునీకరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు.
ఇంతకాలం నిర్లక్ష్యం వల్ల విద్యుత్ స్థంభాలు, వేలాడుతున్న వైర్లు, అడ్డదిడ్డంగా ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌లను సరిచేస్తామన్నారు. ఇళ లపైనుండి వెళ్తున్న లైన్‌లన్నింటినీ తొలగిస్తామన్నారు. నూతంగా 5 కిలోమీటర్ల పొడవునా 33/11 కేవీ లైన్, రెండు కిలోమీటర్ల హెచ్‌టీ లైన్, 10 కిలోమీటర్లు ఎల్‌టీ కేబుల్ వేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా 40 విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ల సామర్ధ్యం పెంచడంతో పాటు కొత్తగా 60 ట్రాన్స్‌ఫార్మర్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద కోదాడలో 5.50 కోట్లు, హుజూర్‌నగర్‌లో 5.09 కోట్లతో పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాశ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి, విద్యుత్ ఎస్‌ఈ పాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సూర్యాపేటలో సమీకృత విద్యుత్ అభివృద్ధి పథకం పనులకు ఆదివారం శంకుస్థాపన చేస్తున్న
విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి