తెలంగాణ

మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 3: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం విద్యుత్ కొరతను అధిగమించేందుకు ముందస్తుగా ఖరారు చేసి అమలు చేస్తున్న ప్రణాళికల వల్ల సత్ఫలితాలు వస్తున్నాయి. మిగులు విద్యుత్ దిశగా తెలంగాణ వడివడిగా అడుగులు వేస్తోంది. 2018లో రాష్ట్ర గ్రిడ్‌కు అదనంగా మూ డు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి అనుసంధానం చేయనున్నారు. దీని వల్ల వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ను ఎటువంటి అవాంతరాలు లేకుండా కొనసాగించేందుకు వీలవుతుంది. తెలంగాణ రాష్ట్రం అవతరించేనాటికి 6574 మెగావాట్ల స్ధాపిత విద్యుత్ సామర్ధ్యం ఉండేది. మూడున్నర సంవత్సరాల్లో 7981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ కెపాసిటీ 14555 మెగావాట్లు. మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో మూడు వేల మెగావాట్ల విద్యుత్ 2018లో ఉత్పత్తి చేస్తారు. రాష్ట్రప్రభుత్వం విద్యు త్ రంగంలో సాధిస్తున్న విజయాలను చూసి రూరల్ ఎలక్ట్ఫ్రికేషనన్ కార్పోరేషన్ (ఆర్‌ఇసి), పవర్ ఫైనాన్స్‌కార్పోరేషన్ (పిఎఫ్‌సి) సంస్ధలు విద్యుత్ రుణాలపై వడ్డీని 11.5 శాతం నుంచి 9.65 శాతానికి తగ్గించాయి. ఈ వడ్డీ రాయితీ వల్ల సాలీనా రాష్ట్ర ఖజానాకు రెండు వందల కోట్ల రూపాయల ఆదా అవుతోం ది. దీని వల్ల గ్రామీణ విద్యుత్ రంగంలో మరిన్ని లక్ష్యాలను సాధించేందుకు వీలవుతుందని విద్యు త్ నిపుణులు తెలిపారు. కొత్త గూడెం థర్మల్ విద్యుత్ స్టేషన్ ఏడవ యూనిట్‌లో వచ్చేనాలుగు నెలల్లో 800 మెగావాట్ల విద్యుత్‌ను సూపర్ క్రిటికల్ పద్ధతిలో ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ లో బాయిలర్లను కూడా సూపర్ క్రిటికల్ టెక్నాలజీలో నెలకొల్పారు. వీటికి అవసరమైన అనుమతులు కూడా వచ్చాయి. భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నుంచి 1080 మెగావాట్ల విద్యుత్ 2018లో ఉత్పత్తి చేయనుంది. అదనంగా 1200 మెగావాట్ల సౌర విద్యుత్ కూడా అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. దీని వల్ల రాష్ట్ర ఖజానాకు రూ.617 కోట్ల భారం పడనుంది. సాలీనా విద్యుత్ రంగానికి సబ్సిడీల కింద రూ. 5684 కోట్లను ప్రభుత్వం ఈ ఏడాది ఖర్చుపెడుతోంది. దీనికి అదనంగా రూ.617 కోట్లను ఖర్చుపెట్టనున్నారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. 24 గంటల వ్యవసాయ విద్యుత్ వల్ల ఈ రబీ సీజన్‌లో పంటల ఉత్పత్తి బంపర్‌గా ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సౌర విద్యుత్‌లో అభివృద్ధి కూడా ఒక కారణం. 2792 మలెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచింది.