తెలంగాణ

ఆధునిక విధానాల్లో అంబేద్కర్ భవనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో ఆధునిక విధానాల్లో అంబేద్కర్ భవనాలను నిర్మిస్తున్నామని దళిత సంక్షేమ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన సచివాలయంలో అంబేద్కర్ భవన నిర్మాణాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. జిల్లా కేంద్రాల్లో ఒక కోటి నుండి రెండు కోట్ల రూపాయలతో, డివిజనల్ కేంద్రాల్లో 50 లక్షల రూపాయలతో, మండల కేంద్రాల్లో 25 లక్షల రూపాయలతో, గ్రామపంచాయితీల్లో ఏడులక్షల రూపాయలతో అంబేద్కర్ భవనాలు నిర్మిస్తామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇందుకోసం ఆమోదం తెలిపారన్నారు. భువనగిరిలో నిర్మించబోయే అంబేద్కర్ భవన ప్లాన్‌ను ఈ సందర్భంగా పరిశీలించి, స్వల్పమార్పులతో భవనాన్ని నిర్మించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖరరెడ్డి, ఇఇ జోగారెడ్డి, డిఇ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు.