తెలంగాణ

బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా 6న తెలంగాణ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా ఈ నెల 6వ తేదీన తెలంగాణ బంద్‌కు మజ్లీస్ బచావ్ తహరీక్ (ఎంబిటి) పిలుపునిచ్చింది. ఎంబిటి అధ్యక్షుడు మజీద్ ఉల్లా ఖాన్ సోమవారం నాడిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ లౌకికవాదాన్ని ఎవరైతే విశ్వసిస్తారో వారంతా ఈ నెల 6న చీకటి దినంగా పాటించి బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బాబ్రీ మసీదును కూల్చివేసిన రోజు చీకటి రోజుగా పాటించి ప్రతి ఒక్క లౌకికవాది ముందుకు రావాలని అన్నారు. బాబ్రీ మసీదు ఉన్న చోటే రామమందిరం నిర్మిస్తామంటూ ప్రజల్లో అనవసర అయోమయం సృష్టిస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఖాన్ డిమాండ్ చేశారు. ఒక వైపు ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ కోర్ట్ధుక్కారానికి పాల్పడుతూ భగవత్ బాబ్రీ మసీదు కూల్చివేసిన చోటే ఎట్టిపరిస్థితుల్లో మందిరం నిర్మించి తీరుతామని చెబుతున్నారని అన్నారు. 1992లో సుప్రీంకోర్టు స్టేటస్ క్వో ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి కొన్ని ఫాసిస్ట్ వర్గాలు బాబ్రీమసీదును కూల్చివేశాయని గుర్తు చేశారు.