తెలంగాణ

యువత పోరుబాట పట్టాలి: సీఐటీయు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: నిరుద్యోగ సమస్య పరిష్కారం, ఉద్యోగాల సాధన కోసం యువత పోరుబాట పట్టాలి తప్ప ఆత్మహత్యలు పరిష్కారం కాదని తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు సిఐటియు రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఉద్యోగాలు రావడం లేదని మనస్థాపానికి గురై ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన పిజి విద్యార్థి ఈ.మురళి ఆత్మహత్య చేసుకోవడం విచారకరమని అన్నారు. సోమవారం సిఐటియు రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చుక్క రామలు, ఎం.సాయిబాబులు ఒక ప్రకటన విడుదల చేశారు. మురళీ మృతికి సంతాపం వ్యక్తం చేసినట్లు తెలిపారు. పోస్టుల మంజూరు, ఉద్యోగాల భర్తీ అంటూ హడావుడి తప్ప ఆచరణలో ఉద్యోగాల కల్పనకు, భర్తీకి నిర్ధిష్టమైన చర్యలు చేపట్టడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్న కెసిఆర్, అందరికీ ఉద్యోగాలివ్వటం ఎలా కుదురుతుంది అంటూ శాసనసభలో చెప్పడం ఆయన అవకాశ వాదానికి నిదర్శనమని పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించకుండా వారిని నిరాశకు గురి చేసి ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణమవుతోందని ఆరోపించారు.