తెలంగాణ

ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి: బీజేపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 4: రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు, విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్, టిఆర్‌ఎస్ , టిడిపిల నుండి 500 మంది కార్యకర్తలు బిజెపిలో చేరిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అవినీతి, కుటుంబ పాలనను టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు కొనసాగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఎపుడు భర్తీ చేస్తుందో క్యాలండర్ ప్రకటించాలని అన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని, పోలీసు రాజ్యం, నిజాం రాజ్యం చలాయిస్తున్నారని ఆయన అంటూ ప్రభుత్వం మోసపూరిత వాగ్దానాలు చేస్తోందని చెప్పారు. వాటిని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అన్నారు. త్వరలో రాష్ట్రంలో పలు నియోజకవర్గాల్లో టిడిపి,టిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఖాళీ అవుతాయని మీడియా కన్వీనర్ వి సుధాకర్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బంగారు శృతి, బోసుపల్లి ప్రతాప్, అశోక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసు క్యాంపుగా ఉస్మానియా
ఉస్మానియా ఘటనలపై బిజెపి శాసనసభాపక్షం నేత జి కిషన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. వర్శిటీలో మురళీ అనే విద్యార్థి ఆత్మహత్య అనంతరం పరిస్థితులను అదుపులోకి తీసుకురావడంలో ప్రభుత్వం విఫలమైందని ఆయన అన్నారు. కాగా కిషన్‌రెడ్డి వేరోక ప్రకటనలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సిద్ధంకావడాన్ని విమర్శించారు. రాహుల్ వ్యవహార శైలి, కార్యదక్షతపై దేశ ప్రజలకు ఎన్నడూ నమ్మకం లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.