తెలంగాణ

నిరుద్యోగ సమస్య తీరదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/కాచిగూడ, డిసెంబర్ 5: ప్రభుత్వ శాఖలలో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేసినప్పటికి నిరుద్యోగ సమస్య పూర్తిగా తీరదని స్వయం ఉపాధిపై యువత దృష్టి సారించాలని ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ మీ-సేవ రూ.10కోట్ల లావాదేవిలు జరిపినందుకు తెలంగాణ మీ-సేవ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందన సభ మంగళవారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజలకు విశేషమైన సేవలందించడంలో మీసేవ ముందంజలో ఉందని అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన డిజిటల్ అక్షరాస్యతలో మీ-సేవ ఆపరేటర్స్ భాగస్వాములు కావాలని ఆకాక్షించారు. ప్రజలకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాని ప్రభుత్వం పెంచుతుందని స్పష్టం చేశారు. సాంకేతిక రంగల్లో అభివృద్ధి చెందుతున్న దేశాలలో మొదటిది భారత దేశమని అన్నారు. భారత దేశం అత్యంత సెల్‌ఫోన్‌లు వాడడంలో రెండవ స్థానంలో నిలిచిందని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో విద్య, వైద్య రంగల్లో మార్పులు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. విద్య, వైద్య రంగలకు సాంకేతిక పరిజ్ఞానం జోడిస్తే మార్పులు వస్తాయని అశాభావం వ్యక్తం చేశారు. ఇసుక మఫీయా తెలంగాణలో లేదని, ఇసుక లావాదేవిలతో ప్రభుత్వనికి వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. భూ రికార్డులో సిరిసిల్ల జిల్లా వంద శాతం రికార్డులు పొందుపరిచి మొదటి స్థానంలో నిలిచిందని స్పష్టం చేశారు. మీసేవలలో మర్నిని సేవలను జోడించేందుకు ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. మీ సేవపై జీఎస్‌టీ భారం ప్రభుత్వమే భరించే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు. మీ-సేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.