తెలంగాణ

ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: హైదరాబాద్‌లో ఈనెల 15 నుంచి 19 వరకు నిర్వహించతలపెట్ని ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించాలని విప్లవ రచయితల సంఘం పిలుపునిచ్చింది. తెలుగు నేలపై నలభై రెండేళ్లలో మూడోసారి మహాసభలు జరుగుతున్నాయని, వీటిని ప్రతీసారి ప్రభుత్వమే నిర్వహిస్తుందని విప్లవ రచయితల సంఘం తెలిపింది. పాలకులు ఈ సభలను అగ్రకుల, దోపిడీ, భూస్వామ్య పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాఃను, భావజాలాన్ని ప్రచారం చేసేందుకే ఉపయోగించుకుంటున్నారని విరసం మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మార్చి 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హైదరాబాద్‌లో మొదటిసారిగా మహాసభలను నిర్వహించారని, తెలంగాణ రక్షణ కోసం 1969లో రవీంద్రనాథ్ అనే విద్యార్థిని ఖమ్మంలో నిరాహారదీక్షకు కూర్చోబెట్టిన వెంగళరావు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో హోంశాఖ మంత్రి అయ్యారు. అదే తెలంగాణ ఉద్యమాన్ని రక్తపుటేరుల్లో ముంచారని విరసం ఆరోపించింది. జలగం వెంగళరావు శ్రీకాకుళం పోరాటాన్ని ఎన్‌కౌంటర్ చేశారని, రెండు ప్రజాపోరాటాలను అణచివేసి విశాలాంధ్ర పాలకుడిగా ప్రపంచ తెలుగు మహాసభల పేరుతో సమైక్యత ఉత్సవాలు నిర్వహించారని విరసం నిశితంగా విమర్శించింది. విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రహి, చినబాబు, పంచారి నిర్మల, స్నేహలత, వి సత్యం మాస్టారును చంపిన వెంగళరావు ప్రభుత్వం, ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకునేందుకు ప్రపంచ మహాసభలను ముందుకు తెచ్చారని విరసం ఆరోపించింది. ఈ మహాసభలు భూస్వామ్య, బూర్జువా సంస్కృతికి వరాలని, ఈ సభలను ప్రముఖ కవి శ్రీశ్రీ కూడా బహిష్కరించారని విరసం గుర్తు చేసింది. 2012 డిసెంబర్ 27నుంచి 29 వరకు నాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి రెండోసారి తిరుమల కొండపై తెలుగు మహాసభలను నిర్వహించారని, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వేదికగా వాడుకున్నారని విరసం ఆరోపించింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలను తెలుగు ప్రజలు, కవులు, కళాకారులు, రచయితలు బహిష్కరించాలని విప్లవ రచయితల సంఘం కోరింది.