తెలంగాణ

24 లక్షల ఓటర్లపేర్లు తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: రాష్ట్రంలోని 14 జిల్లాల్లో ఉన్న 36 శాసనసభా నియోజకవర్గాల్లో (మున్సిపల్ కార్పోరేషన్లు కలిగిన) ఇటీవల జరిపిన ఇంటింటికి సర్వే సందర్భంగా 24,20,244 ఓటర్లపేర్లను తొలగించామని చీఫ్ ఎలక్టోరల్ అధికారి అనూప్ సింగ్ తెలిపారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ, సర్వే తర్వాత 91,06,862 మంది ఓటర్లుగా ఉన్నట్టు తేలిందన్నారు. ఇందుకు సంబంధించి ముసాయిదా ఓటర్లజాబితాలను 2017 నవంబర్ 27 న ప్రచురిస్తామని, ఫిర్యాదులను డిసెంబర్ 31 వరకు స్వీకరిస్తామని, డిసెంబర్ 17, 24 తేదీల్లో ప్రత్యేక ప్రచారం చేస్తామన్నారు. 2018 జనవరి 10 వరకు ఫిర్యాదులను పరిష్కరిస్తామని, జనవరి 13 వరకు ఓటర్ల జాబితా పూర్తవుతుందని, తుది జాబితా పింటింగ్ జనవరి 15 చేసి జనవరి 20 న జాబితా వెల్లడిస్తామని అనూప్ సింగ్ తెలిపారు.

చిత్రం..సీఈఓ అనూప్‌సింగ్