తెలంగాణ

విశ్వవిద్యాలయాల బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మురళీ ఆత్మహత్య, అనంతర పరిణామాలతో విద్యార్ధులపై లాఠీచార్జీని నిరసిస్తూ ఎబివిపి ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం నాడు విశ్వవిద్యాలయాల బంద్ ప్రశాంతంగా జరిగింది. అదుపులోకి తీసుకున్న విద్యార్థులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించడంతో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు జైలుకు వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. మరో పక్క రాష్ట్రంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం అయిందని ఎబివిపి గ్రేటర్ కార్యదర్శి జె దిలీప్ పేర్కొన్నారు. జెఎన్‌టియులో సైతం బంద్ నిర్వహించి, రాయలీ ద్వారా ప్రధానద్వారానికి చేరుకుని ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్టు ఆయన చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎలాంటి అధైర్యానికి గురికావద్దని, ప్రభుత్వం వెంటనే లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని , ఆత్మహత్యలు చేసుకున్న మురళీ, భూమేష్‌ల కుటుంబాలకు ప్రభుత్వం 50 లక్షల పరిహారం అందించాలని అన్నారు. మూడు ఎకరాల భూమిని ఇచ్చి న్యాయం చేయాలని, ప్రభుత్వం నిరుద్యోగుల కోరిక మేరకు ఉద్యోగాలు కల్పించాలని, ఉద్యోగ నోటిఫికేషన్లలో జాప్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు. పోలీసులతో ఉద్యమాలను ఆపాలనే నియంతృత్వ పోకడలను ఆపాలని ఎబివిపి నేతలు పేర్కొన్నారు.