తెలంగాణ

మురళీ ఆత్మహత్యపై న్యాయ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ఉస్మానియా వర్సిటీ వసతి గృహాంలో విద్యార్థి మురళి ఆత్మహత్య ఘటనపై న్యాయ విచారణ జరిపించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులపై అన్యాయంగా, అక్రమంగా పోలీసులు కేసులు పెట్టారని ఆయన విమర్శించారు. సోమవారం పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గుడా జైల్లో ఉంచిన విద్యార్థి సంఘాల నాయకులు ప్రకాప్‌రెడ్డి, అద్దంకి దయాకర్, మానవతా రాయ్, దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్‌లను ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, డాక్టర్ జె.గీతారెడ్డి, టి. రాంమోహన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత తదితరులు మంగళవారం పరామర్శించారు. అనంతరం ఉత్తమ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకే జైలుకు వచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని ఆయన తెలిపారు. ఉస్మానియా వర్సిటీ విద్యార్థి మురళి ఉద్యోగం రావడం లేదన్న నిరాశ, నిస్పృహతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన చెప్పారు. విద్యార్థులు, నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలకు తమ పార్టీ అండగా ఉంటుందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌పై పోటీ చేసిన ఒంటేరు ప్రతాప్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టించారని ఆయన తెలిపారు.

చిత్రం..చంచల్‌గూడా జైలు వద్ద విలేఖరులతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలు