తెలంగాణ

మెట్రోరైళ్ల సంఖ్య పెంచండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: మెట్రోరైళ్ల సంఖ్యను పెంచే అవకాశాలను పరిశీలించాల్సిందిగా అధికారులను మున్సిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె తారకరామారావు ఆదేశించారు. మెట్రోరైలు ప్రయాణానికి ప్రజల నుంచి భారీ స్పందన ఉన్న నేపథ్యంలో రైళ్లను పెంచాలని మంత్రి సూచించారు. ప్రయాణికుల రద్దీని అంచనా వేసి ఫిబ్రవరిలో రైళ్ల ఫ్రీకెన్సీనీ పెంచుతామని అధికారులు తెలిపారు. వచ్చే జూన్ నాటికి ఐటీ కారిడార్లలో మెట్రోరైలు నిర్మాణ పనులను పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.
బేగంపేట క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ మెట్రోరైలు అధికారులతో మంగళవారం మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతీ మెట్రో స్టేషన్‌లో పార్కింగ్ సదుపాయం కల్పించాలని, మెట్రో స్మార్ట్ కార్డుల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపట్టాలన్నారు.
మెట్రో స్టేషన్ల రూట్లలో బస్సుల సంఖ్యను పెంచడానికి ఆర్టీసి అధికారులతో చర్చించాలని ఆదేశించారు. మెట్రో స్టేషన్లలో ప్రస్తుతం పరిమితంగా ఉన్న మూత్రశాలలకు అదనంగా మరిన్నింటినీ నిర్మించాలని, మంచినీటి సౌకర్యాన్ని తక్షణం కల్పించాలని మంత్రి ఆదేశించారు. అమీర్‌పేట నుంచి హైటెక్ సిటీ రూట్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మెట్రోరైలు ప్రయాణం పట్ల ప్రజల ఆసక్తి కనబర్చడం పట్ల మంత్రి ఆనందం వ్యక్తం చేసారు.

చిత్రం..మంగళవారం హైదరాబాద్‌లో మెట్రోరైల్ అధికారులతో సమావేశమై చర్చిస్తున్న మంత్రి కేటీఆర్