తెలంగాణ

విద్యార్థులతో ఆడుకుంటున్న ‘శ్రీనిధి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 5: ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలు, స్కూళ్ల ఆగడాలు రోజురోజుకూ శృతిమించడంపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందిస్తున్నా యాజమాన్యాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యం , టీచర్లు ఒక విద్యార్థిని వేధింపులకు గురిచేయడంపై విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్‌లో వాణి, సురేష్ దంపతుల కుమారుడు చైతన్య ఏడో తరగతి చదువుతున్నాడు. 20 రోజుల క్రితం బాలుడి కాలి వేలికి గాయం కావడంతో స్కూల్‌కు షూ వేసుకోకుండా వెళ్లాడు. షూ వేసుకోలేదని టీచర్లు దండించారు. బాలుడికి గాయం అయ్యిందని, ముందుగానే లిఖిత పూర్వకంగా చెప్పినా ఎందుకు దండించారని స్కూల్ హెడ్ బ్రూస్ ఫెర్గూసన్‌ను అడగడంతో అవమానంగా భావించిన హెడ్ రెండు రోజుల పాటు నిలబెట్టి శిక్షించదలిచినట్టు లిఖిత పూర్వకంగా తెలిపి విద్యార్థిని శిక్షించారు. దాంతో విద్యార్థి తల్లిదండ్రులు బాలల హక్కుల సంఘాన్ని ఆశ్రయించారు. అనంతరం మొయినాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విద్యార్ధిపై కక్షగట్టి విద్యార్థి చెల్లెలును కూడా తొలగిస్తూ యాజమాన్యం లేఖ ఇచ్చింది. ఈ విషయంలో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి జోక్యం చేసుకుంటూ స్కూల్ హెడ్‌ను మందలించడంతో పాఠశాలకు రావాలని పిలిచిన యాజమాన్యం క్లాసు రూమ్‌లోకి మాత్రం పంపించకుండా క్లాసు బయటే నిలబెట్టింది. ఇలా విద్యార్థిని మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న పాఠశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు డిమాండ్ చేశారు.
ఆక్వారీజియాలో కొచ్చిన్ విద్యార్థులు టాప్
టైమ్ విద్యాసంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆక్వారీజియా సైన్స్ క్విజ్‌లో కొచ్చిన్ విద్యార్థులు మాధవ్ ప్రమోద్, పిఎస్ అనిరుథ్ అగ్రస్థానంలో నిలిచారు. రెండో స్థానంలో అబిడ్స్ లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్ధులు హుస్సేన్ అహ్మద్, ఎస్ ఎ మన్నన్ నిలిచారు. మూడో స్థానంలో ముంబైకి చెందిన జిడి సోమని మెమోరియల్ స్కూల్‌కు చెందిన అంతర భట్టాచార్య, హర్షరావులు నిలిచారు. టైమ్ సెంటర్ డైరెక్టర్ అరవింద్ మంత్రి వారిని అభినందించారు.
కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలి
ఉస్మానియా యూనివర్శిటీలో బోధనేరత సిబ్బందిని, టీచింగ్ సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలని 20 రోజులుగా చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా బిజెపి ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ 24 గంటల ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంట్రాక్టు అవుట్‌సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని ప్రభుత్వం చెప్పి మిగిలిన శాఖల్లో చేస్తున్నా విద్యాశాఖలో మాత్రం చేయడం లేదని ఆరోపించారు. వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించకుంటే సమ్మె విరమించేది లేదని ఆయన హెచ్చరించారు.