తెలంగాణ

తండ్రీ కొడుకులది అధికార దర్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 5: నిజాం పాలన కాలంలోని నియంతృత్వ పోకడలు కంటే ప్రస్తుతం తెలంగాణలో టీఆర్‌ఎస్ నిరంకుశ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో అరుణ విలేఖరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు తెలియవు, కేవలం తండ్రీకొడుకులు అధికార దర్పంతో, అహకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి చేసింది ఏమీలేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయమని అడుగుతుంటే, కేటీఆర్ కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న విమర్శలు సరికాదని పేర్కొన్నారు. నిజంగా టీఆర్‌ఎస్ పాలన అంతచక్కగా ఉందనుకుంటే ఎవరు ప్రభుత్వాన్ని విమర్శించిన టీఆర్‌ఎస్ నాయకులు భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు ఆశలు కల్పించి, ఇప్పడు ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నిస్తుంటే, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, మంత్రులు కాంగ్రెస్‌పై అసహనాన్ని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు రాకా ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల కుంటుంబాలకు 50 లక్షల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని, వారి కుంటుంబంలో ఒకరికి ఉద్యోగ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ఒక నియంత: పొన్నాల
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును, ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో విలేఖరులతో మాట్లాడుతూ కొలువుల కొట్లాట సభకు కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా, సభకు రాకుండా 31 జిల్లాల్లో వెయ్యి మందిని పోలీసులు నిర్బంధించారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించిన వారిపై కేసులు నమోదు చేసి, జైళ్లలో పెడుతున్నారని ఆరోపించారు.