తెలంగాణ

ప్రేమికుడి వేధింపులు తాళలేక వైద్యురాలు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్,దిల్‌సుఖ్‌నగర్, డిసెంబర్ 5: నగరంలోని చైతన్యపురిలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమికుడి వేధింపులు తాళలేక ఓ వైద్యురాలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రేమలో మోసపోయాను..చనిపోతున్నానంటూ కుటుంబీకులకు ఫోన్ చేసి బలవన్మరణానికి పాల్పడింది. మంగళవారం చైతన్యపురిలో చోటుచేసుకున్న సంఘటన వివరాల్లోకి వెళితే..జగిత్యాల జిల్లాకు చెందిన గీతాకృష్ణ ఎంబీబీఎస్ చదివింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తుంది. ఇదే క్రమంలో నల్గొండ జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నరేష్ పరిచయం కావడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. నరేష్‌ను పూర్తిగా నమ్మిన గీతాకృష్ణా అతణ్ని పెళ్లిచేసుకునేందు సిద్ధమయ్యారు. పెళ్లికి తల్లిదండ్రులు వద్దని చెప్పినా నరేష్‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటున్నారు. కాగా నరేష్ వేధించడం వల్లే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గీతాకృష్ణ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. కేసు దర్యాప్తులో ఉన్నట్టు చైతన్యపురి పోలీసులు తెలిపారు.
వైద్యురాలు గీతాకృష్ణ ఆత్మహత్య కేసులో కొత్త మలుపు చోటుచేసుకుంది. గీత మృతదేహం పక్కన ఓ సూసైడ్ నోట్ లభ్యమైంది. తొలుత మెడికో ఆత్మహత్యకు కారణం ఆమె స్నేహితుడు నరేష్ అని అంతా భావించారు. నరేష్ వేధించడం వల్లే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్టు గీత తమకు ఫోన్ చేసిందని, అతనిపై చర్యలు తీసుకోవాలంటూ గీత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే..తన మృతికి ఎవరూ బాధ్యులు కారంటూ గీత తాను రాసిన సూసైడ్ నోట్‌లో పేర్కొంది. నరేష్ తన చిన్ననాటి క్లాస్‌మేట్ అని, అతను మంచివాడని పేర్కొంది. నరేష్‌ను ఏమి అనొద్దని లేఖలో రాసింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న గీతాకృష్ణ, తాను ఉంటున్న హాస్టల్‌లో బలవన్మరణానికి పాల్పడింది. కాగా ప్రేమించిన యువకుడు మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు ప్రాథమికంగా భావించారు. కానీ ఈ కేసులో కొత్త మలుపు చోటుచేసుకోవడంతో పోలీసులు తల్లిదండ్రుల ఫిర్యాదుతోపాటు, సూసైడ్ నోట్‌లో పేర్కొన్న విషయంపైనా దర్యాప్తు చేస్తున్నట్టు చైతన్యపురి పోలీసులు తెలిపారు.