తెలంగాణ

రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనతో రైతుల సమస్యలు పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలిగొండ, డిసెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఉద్యమంలా చేపట్టిన భూరికార్డుల శుద్ధీకరణతో రైతుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్పీ సింగ్ అన్నారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని గోకారం గ్రామంలో రెవెన్యూ రికార్డుల శుద్ధీకరణ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక పాస్‌బుక్‌లు పాస్‌పోర్టు కంటే బాగుంటాయని, అందులో హైసెక్యురిటీ ఫీచర్స్ ఉంటాయని, వీటిని మరో నెలరోజుల్లో రైతులకు అందజేస్తామన్నారు.
అదేవిధంగా రైతులు రుణాల కోసం పాస్‌బుక్‌లు తీసుకువెళ్లాల్సిన అవసరం లేదని, ఆన్‌లైన్‌లో నమోదు చేసి బ్యాంకులకు కూడా లింకు చేస్తామని, దీంతో రైతులు బ్యాంకుల నుండి రుణాలను సులభంగా పొందవచ్చునన్నారు. రికార్డుల శుద్ధీకరణతో రైతులకు లాభం చేకూరుతుందని అన్నారు. వలిగొండ మండలంలోని 95 శాతం రికార్డుల శుద్ధీకరణ జరిగిందని, దీనికి అధికారులను అభినందిస్తున్నానని, మిగతా పనిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా జడ్పీటీసీ మొగుళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ వక్ఫ్‌బోర్డు, రైతుల హద్దుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఎంపీటీసీ నూతి రమేశ్ మాట్లాడుతూ మూసీనది ఆక్రమణలను అడ్డుకోవాలని, మిషన్ కాకతీయ పనులు నేటికీ చేపట్టలేదని కనుక వెంటనే చేపట్టాలని, దేవాలయ భూములను సర్వే చేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి కలెక్టర్ అనితారాంచంద్రన్, నల్లగొండ కలెక్టర్ గౌరవ ఉప్పల్, భూరికార్డుల శుద్ధీకరణ మిషన్ డైరెక్టర్ వాకాటి కరుణ, జేసీ రవినాయక్, ఆర్డీవో సూరజ్‌కుమార్, ఎసీపీ వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాస్, తహాశీల్దార్ భీంపాక యాదయ్య, ఏఆర్‌ఐ శ్రీనివాస్, సర్పంచ్ సిర్పంగి నిర్మల, విఆర్వోలు నరేందర్‌రెడ్డి, సలామ్, నూనె వెంకటేశ్వర్లు, నర్సింహ్మా, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.