తెలంగాణ

పరిహారం చెల్లించాకే పనులు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిగూడ, డిసెంబర్ 6: డిండి ఎత్తిపోతల పథకం లో భాగంగా మండలంలోని శివన్నగూడెం గ్రామ శివారులో చర్లగూడెం ప్రాజెక్టు నిర్మిస్తున్న నేపథ్యంలో వరుసగా మూడు రోజుల నుంచి భూ నిర్వాసితులు నష్టపరిహారం కోసం ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పోలీసులు అకారణంగా లాఠీచార్జి చేయడాన్ని నిరసిస్తూ గత రెండు రోజులుగా అఖిలపక్ష పార్టీల మద్దతు కూడగట్టుకొని ప్రభుత్వ తీరును ఎండగడుతూ ధర్నా చేశారు. ఇంత చేసినప్పటికీ ప్రాజెక్టు పనులను పోలీస్ బలగాల మధ్య నిరాటంకంగా కొనసాగిస్తుండడంతో ఆగ్రహించిన బాధితులు, విపక్షాల నాయకులు భద్రతా బలగాలను ఛేదించుకొని బుధవారం రిజర్వాయర్ పునాది కట్టవైపు దూసుకెళ్లారు. పనులను అడ్డుకునే క్రమంలో నిర్వాసితులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
నిర్వాసితుల పక్షాన పోరాడుతున్న ఎంపీపీ అనంతరాజుగౌడ్, సీపీఐ మండల కార్యదర్శి ఈదుల బిక్షంరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగి పెద్ద ఎత్తున చేరుకున్న బాధితులతో కలిసి రిజర్వాయర్ కట్టపైనే పనులను నిలిపివేసే వరకు కదలబోమని ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఎంపీపీ, భూ నిర్వాసితులు, అఖిలపక్షం పార్టీల నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం దిగి వచ్చి పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించే వరకు పనులను జరగనివ్వబోమని హెచ్చరించారు. సర్వస్వం కోల్పోయిన తమకు ప్రాణాలు బలివ్వడం పెద్ద సమస్య కాదని, ప్రభుత్వం లాఠీచార్జి చేయించడం కాకుండా తమ శవాలపై ప్రాజెక్టుకు పునాదులు వేసుకోవాలని హితవు పలికారు. చర్లగూడెం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, పరిహారం కోసమే తమ పోరాటమని నిర్వాసితులు స్పష్టం చేశారు. 104 రోజులుగా పరిహారం కోసం ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే ప్రభుత్వం పోలీసులతో లాఠీచార్జి చేయించడం అమానుషమన్నారు. ప్రాజెక్ట్ పుణ్యమా అని ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని, గుంట భూమి కొనే పరిస్థితి లేదన్నారు.
ప్రభుత్వం ఎకరాకు అందించే 5.15 లక్షల పరిహారం సరిపోదని, పైలాన్ ఆవిష్కరణలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ప్రభుత్వం ఇదేవిధంగా ప్రవర్తిస్తే జరగబోయే పరిణామాలకు నైతిక బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. పరిహారం ఇచ్చేంతవరకు తమ భూముల్లో గంపెడు మట్టిని కూడా ఎత్తనీయబోమన్నారు. నిర్వాసితుల ఆందోళన తీవ్రం కావడంతో ఎట్టకేలకు పోలీసులు ప్రాజెక్టు పనులను నిలిపివేయించారు. దీంతో నిర్వాసితులు రిజర్వాయర్ కట్ట నుంచి కిందికి దిగారు. మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడి ప్రాజెక్టు పనులను కొనసాగిస్తే మరింత ఉధృతంగా ప్రభుత్వంపై పోరాడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పిట్టల శ్రీనివాస్, సీపీఐ నాయకుడు బూడిద సురేష్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, వామపక్షాల, ప్రజా సంఘాల నాయకులు, భూ నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.