తెలంగాణ

గాడినపడేందుకు మరో పదేళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 6: రాష్ట్రంలో విద్యావ్యవస్థ గాడిన పడాలంటే మరో పదేళ్లు పడుతుందని, పూర్తిగా నిర్లక్ష్యానికి గురికావడంతో గాడిన పెట్టేందుకు ఎంతో శ్రమించాల్సి వస్తుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.49 కోట్లతో నిర్మించే వివిధ భవనాల శంకుస్థాపనలకు మంత్రి కడియం శ్రీహరి బుధవారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యావ్యవస్థ పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని, పాలకులు తమ ఇష్టానుసారంగా ఇబ్బడి ముబ్బడిగా యూనివర్సిటీలు, డిగ్రీ కళాశాలలు, జూనియర్ కళాశాల లు ఏర్పాటు చేశారని, అయితే వాటికి సంబంధించిన అధ్యాపకులను, వసతులను కల్పించకుండా నాశనం చేశారని ఆరోపించారు. యూనివర్సిటీల తో పాటు కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేయడానికి విడతల వారిగా చర్యలు తీసుకుంటామన్నారు. విశ్వవిద్యాలయాలు అంటే ఒక దిక్సూచి లాంటివని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఫౌండేషన్ గట్టిగా ఉండాలని ప్రైమరీ ఎడ్యుకేషన్‌లోనే ఎన్నో లోటుపాట్లు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 11 యూనివర్సిటీలకు గాను 2017-18 వార్షిక బడ్జెట్‌లో రూ.420 కోట్లు కేటాయించామని వెల్లడించారు. వచ్చే ఏడాది కూడా మరో రూ.400 కోట్లు కేటాయిస్తామన్నారు. యూ నివర్సిటీల్లో 1551 అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వీటిని రెండు విడుతల్లో 1060 ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. మరో 500లకుపైగా ఉద్యోగాలను రెండేళ్లలో భర్తీ చేస్తామన్నారు. పాలమూరు యూనివర్సిటీకి రూ.40 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్‌లో ముందంజ లో రాణిస్తున్నారని అందుకే విదేశాల్లో కూడా పలు కంపెనీలకు తెలుగు ప్రజలే సీఈఓలుగా వ్యవహరిస్తున్నారని వెల్లడించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, కలెక్టర్ రోనాల్డ్‌రోస్, పాలమూరు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రాజారత్నం పాల్గొన్నారు.