తెలంగాణ

విద్యావ్యవస్థ పటిష్టతే ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వనపర్తి, డిసెంబర్ 6: రాష్ట్రంలో విద్యావ్యవస్థను పటిష్టపరచడమే ప్రభు త్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నా రు. బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో 7.65 కోట్ల వ్యయంతో నిర్మించిన మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పాలిటెక్నిక్ కళాశాలల్లో ఖళీ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. సాంకేతిక విద్యకోసం 246 కోట్లు ఖర్చు చేస్తున్నామని, విద్యాసంస్థల్లో వౌలిక వసతులను కల్పించేందుకు 2 వేల కోట్లు వెచ్చించినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 29 పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభిస్తున్నామని, అందులో ఉమ్మడి పాలమూరు జిల్లాకు 7 కళాశాలలను మంజూరు చేశామన్నారు. వనపర్తి జిల్లాకు విద్యాపరంగా అన్ని అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యను అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. రామనందతీర్థ సంస్థ ద్వారా పెబ్బేరు కళాశాలలో నైపుణ్యాల అభివృద్ధికి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లాకు ఇంజనీరంగ్ కళాశాలను మంజూరు చేయాలని, ఖిల్లాగణపురంలో డిగ్రీ కళాశాల ఏర్పా టు చేయాలని, వనపర్తిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో గ్రంథాలయ ఏర్పాటుకు ఐదెకరాల స్థలాన్ని కేటాయించాలని కోరా రు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ మహిళా పాలిటెక్నిక్‌లో వసతి సదుపాయం, ఓరియంటెడ్ తరగతులు నిర్వహించాలని, రెగ్యులర్ స్ట్ఫాను ఏర్పాటు చేయాలని కోరారు. కలెక్టర్ శే్వతామహంతి మాట్లాడుతూ విద్యాభివృద్ధిలో భాగంగా 3 ఆర్స్ ప్రోగ్రాం తో పాటు గణిత సామర్థ్యాల పెంపు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, 300 పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, మరో 300 అదనపు పాఠశాల గదులను మంజూరు చేయాలని కోరారు.