తెలంగాణ

వృద్ధులపై పెరుగుతున్న దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: దేశవ్యాప్తంగా 60ఏళ్లు, ఆపైబడిన వృద్ధులపై రోజురోజుకూ దాడులు పెరిగిపోతున్నాయి. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో నమోదైన కేసులను పరిశీలిస్తే.. 2014లో 17,652 కేసులు నమోదయ్యాయి. 2015లో 19,239 కేసులు నమోదు కాగా, 2016లో 20,657 దాడులు జరిగాయి. దేశంలోని 19 మెట్రో నగరాల్లో 4,694 కేసుల నమోదుతో మహరాష్ట్ర ముందుండగా, మధ్యప్రదేశ్ 3877 కేసులో రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 2243 కేసులు నమోదు కాగా, 1382 కేసులతో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. నేషనల్ క్రైం బ్యూరో రికార్డుల ప్రకారం.. గత ఏడాది మొత్తంలో బీహార్‌లో 272 కేసులు నమోదు కాగా, అస్సాంలో 6, అరుణాచల్ ప్రదేశ్‌లో 2 కేసులు నమోదయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో 902, గోవాలో 43, గుజరాత్‌లో 496, హర్యానాలో 349, హిమాచల్ ప్రదేశ్‌లో 233 కేసులు నమోదు కాగా, కాశ్మీర్‌లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదేవిధంగా జార్ఖండ్‌లో 56, కర్నాటకలో 818, కేరళలో 571, మణిపూర్‌లో 6, మేఘాలయలో 2, మిజోరంలో 15, నాగలాండ్‌లో 4, ఒడిశాలో 229 కేసులు నమోదు కాగా, పంజాబ్‌లో 91, రాజస్థాన్‌లో 652, సిక్కింలో 4, తమిళనాడులో 2895, త్రిపురలో 10, ఉత్తరప్రదేశ్‌లో 621, ఉత్తరఖండ్‌లో 1, వెస్ట్‌బెంగాల్‌లో 184 కేసులు నమోదయ్యాయి.