తెలంగాణ

నకిలీ కరెన్సీ స్వాధీనంలో ఏపీ3, తెలంగాణ 5వ స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 3వ, తెలంగాణ 5వ స్థానంలో ఉన్నాయి. నకిలీ నోట్లను ముద్రించి, చలామణి చేస్తున్న వారిని పట్టుకుని కేసులు నమోదు చేశాయి. గుజరాత్ ప్రధమ, పశ్చిమ బెంగాల్ ద్వితీయ స్థానంలో ఉన్నాయి. ఎపిలో 92,80,000 నకిలీ కరెన్సీని వివిధ ముఠాల నుంచి స్వాధీనం చేసుకోగా, తెలంగాణలో 76,00,905 నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తన నివేదికలో స్పష్టం చేసింది. చట్టవిరుద్ద కార్యకలాపాల చట్టం 2016 కింద వీరందరిపై కేసులు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేస్తున్నాయి. 1079 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు కాగా, ఈ కేసుల్లో 1067 మందిని నిందితులుగా చేర్చారు. తెలంగాణలో స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లలో 2 వేల రూపాయల డినామినేషన్ ఉన్న నోట్లు 114, వెయ్యి నోట్లు 3,206, 500 నోట్లు 8,138, 100 నోట్లు 893, 50 నోట్లు 107, 20 నోట్లు 117, 10 నోట్లు 91 స్వాధీనం చేసుకోగా వాటి మొత్తం విలువ రూ.76,00, 905గా నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే రెండు వేల నోట్లు కేవలం 3 మాత్రమే నకిలీవి దొరకగా, 1000 నోట్లు 5002, 500 నోట్లు 8,296, 100 నోట్లు 1240 స్వాధీనం చేసుకోగా వీటి మొత్తం విలువ రూ. 92,80,000 అని తెలిపింది. దేశ వ్యాప్తంగా ఉన్న నగరాల్లో మొత్తం 294 కౌంటర్‌ఫీట్ కరెన్సీ కేసులు నమోదు కాగా వాటిలో ఢిల్లీలో అధికంగా 76 కేసులు నమోదయ్యాయి. చెన్నై 45, బెంగళూరు 39, హైదరాబాద్‌లో 23 కేసులు నమోదైనట్లు ఎన్‌సిఆర్‌బి పేర్కొంది.