రాష్ట్రీయం

వైకాపాకు మైసూరా గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: వైకాపాకు సీనియర్ నేత మాజీ ఎంపి డాక్టర్ మైసూరా రెడ్డి గుడ్‌బై చెప్పారు. ఆయన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నాలుగు పేజీల లేఖ రాశారు. రాజ్యసభ సీటు కోసం తాను పార్టీని వీడడం లేదని, వైకాపా ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడే ధ్యాస లేదని, అంతర్గత ప్రజాస్వామ్యం గురించి ఆ పార్టీ నాయకత్వం ఆలోచించడం లేదని ఆయన పేర్కొన్నారు. వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వరని, నిత్యం డబ్బు అనే అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. తాను ఏ మానవీయ కోణంలో, మానవతా దృక్పథంతో పార్టీలో చేరానో అవేవి పార్టీలో కనపించడం లేదన్నారు. ఏ మాత్రం మానవీయకోణం లేనప్పుడు పార్టీలో ఉండడం అనవసరమన్నారు. రాచరిక, మొగలాయి చక్రవర్తులు, తెల్లదొరల పాలనలో అధికారం కోసం పెత్తనం చలాయించడం కోసం ఇతరుల కుటుంబాల్లో చిచ్చుపెట్టే సంస్కృతి అప్పట్లో ఉండేదనద్నారు. ప్రజాస్వామ్యంలో ఆ సంస్కృతికి తావులేదన్నారు. తండ్రి కొడుకులకు, భార్యాభర్తలకు అన్నదమ్ములకు మధ్య తగాదాల సంస్కృతిని జగన్ పని గట్టుకుని ప్రోత్సహించడం చూస్తే ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదనిపిస్తుందన్నారు. జగన్‌కు మాట మీద నిలకడ ఉండదని, ఇతరుల సలహాలను పరిగణనలో తీసుకోరని, వాటి గురించి ఆలోచించరన్నారు. మానవతా విలువలకు తావుండదన్నారు. పార్టీకి సంబంధించి ఎలాంటి అంశాలపైన అయినా అప్పటికప్పుడు జగన్ ఇష్టప్రకారం నిర్ణయాలు మారుస్తారని, ఇతర నేతలతో చర్చించాలనుకోరన్నారు. అపరిచితుడు సినిమాలోని క్యారెక్టర్ జగన్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ కుటుంబం సంక్షోభంలో ఉన్నప్పుడు మానవీయతతో వేసని అడుగు తప్పటడుగు అయిందని, రాజకీయాల్లో మానవీయతకు తావులేదని ఎన్నికల తర్వత జరిగిన పరిణామాలతో రుజువైందన్నారు. గతంలో ప్రతి రోజూ జగన్ ఫోన్‌లో మాట్లాడేవారిన, ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఈ వయస్సులో పార్టీలు మారి చెడ్డపేరు తెచ్చుకోవడం ఇష్టం లేదని, రచనా వ్యాసంగం పెట్టుకోవాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నాని ఆయన పేర్కొన్నారు.