తెలంగాణ

బీసీలను ఓటు బ్యాంక్‌గా చూశాయి కాంగ్రెస్, టీడీపీలపై టీఆర్‌ఎస్ ధ్వజం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: కాంగ్రెస్, టిడిపీ ప్రభుత్వాల హయాంలో బిసీలను కేవలం ఓటు బ్యాంక్‌గానే చూసాయని టిఆర్‌ఎస్ విమర్శించింది. బిసీలలో నాలుగు, ఐదు ప్రధాన కులాలను అడ్డంపెట్టుకొని 113 అట్టడుగు కులాలను అణచివేసే దుర్మార్గపు రాజకీయం చేసాయని టిఆర్‌ఎస్ ఆరోపించింది. చరిత్రలో బిసీల సంక్షేమం, అభ్యున్నతిపై ఎ ప్రభుత్వం ఆలోచించలేదని, ఆ దిశగా ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఏసీ గదుల్లో కూర్చొని మొసలి కన్నీరు కారుస్తున్నారని టిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. బిసీలలో అత్యంత వెనుకబడిన కులాలకు ఇంతకాలం అన్యాయం జరిగిందని అన్నారు. ఈ వర్గాల సంక్షేమం, అభ్యున్నతి కోసం ఏడాది కిందట మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ కార్పొరేషన్‌ను ముఖ్యమంత్రి ఏర్పాటు చేసి చైర్మన్‌ను కూడా నియమించారని కర్నె గుర్తు చేసారు. బిసీల్లోని 113 కులాలకు కూడా ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రయోజనం చేకూర్చేందుకు పార్టీలకు అతీతంగా బిసీ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై చర్చించారన్నారు. బిసీల సంక్షేమం, అభ్యున్నతికి ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలు, చేయాల్సిన చట్టాలు, ఉత్తర్వులపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేయాల్సిందిగా బిసీ ప్రజా ప్రతినిధులనే ముఖ్యమంత్రి కోరారని తెలిపారు.