తెలంగాణ

మాకూ అధికారం ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ఔషధాల తయారీ సంస్థలు క్లినికల్ ట్రయల్స్‌ను నిర్వహించేందుకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్‌సివో) అనుమతులు ఇస్తోంది. దీని వల్ల వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఫార్మా కంపెనీలు నిర్వహించే క్లినికల్ ట్రయల్స్ గురించి ముందస్తు సమాచారం తమ వద్ద లభించడం లేదని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రాన్ని కోరుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మా కంపెనీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఈ కంపెనీలు నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌లో చోటు చేసుకునే అపశ్రుతులపై చివరి దాకా రాష్ట్ర ఆరోగ్య శాఖ, రాష్ట్రం పరిధిలోని ఔషధ నియంత్రణ సంస్ధలకు సమాచారం అందడం లేదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేంద్రం ఆధ్వర్యంలోని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఏ) వద్ద అధికారాలు కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ సంస్థనే క్లినికల్ ట్రయల్స్‌ను నియంత్రిస్తుంది. డిసిఏ, సిడిఎస్‌సివో సంస్ధల అధికారులకే ఔషధ సంస్ధలు నిర్వహించే క్లినికల్ ట్రయల్స్‌ను పరిశీలించే అధికారాలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వాలకు క్లినికల్ ట్రయల్స్ విషయంలో ముందస్తు సమాచారం లేనందు వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. కేంద్రం ఆధీనంలో ఉన్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియాకూడా క్లినికల్ ట్రయల్స్‌పై అధికారాలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వాలు ఈ విషయమై అనేక సంవత్సరాలుగా తమకు క్లినికల్ ట్రయల్స్‌పై అధికారాలు ఇవ్వాలని కోరుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది జూన్ నెలలో క్లినికల్ ట్రయల్స్ నిర్వహణ, అధ్యయనంపై ఉన్నత స్ధాయి కమిటీని నియమించింది. రాష్ట్రప్రభుత్వాలకు ఫార్మాకంపెనీలు క్లినికల్ ట్రయల్స్ గురించి సమాచారం ఇవ్వడం అవసరమని రాష్ట్ర ప్రభుత్వ డ్రగ్ నియంత్రణ శాఖ అధికారులంటున్నారు. క్లినికల్ ట్రయల్స్ నిర్వహించే కంపెనీలు దీనికి సంబంధించి ఆడియో విజ్యువల్స్ రికార్డింగ్ నిర్వహించాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైనె్సస్ ఆదేశాలు జారీ చేసింది. క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొనే భాగస్వాములు తమ సమ్మతిని లిఖితపూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుంది. అలాగే క్లినికల్ ట్రయల్స్‌కు అంగీకరించిన వ్యక్తికి దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఫార్మా కంపెనీలు అందించాల్సి ఉంటుంది. సాంకేతిక భాషలో కాకుండా, సాధారణ భాషలో, ఈ ట్రయల్స్‌లో పాల్గొనే వ్యక్తికి పూర్తిగా అర్ధమయ్యే భాషలో వివరించాలని డిజిహెచ్‌ఎస్ సంస్ధ గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. వీరికి ఒక ఫార్మెట్‌కూడా ఉంటుంది. ఒక వేళ క్లినికల్ ట్రయల్స్‌కు అంగీకరించిన వ్యక్తి నిరక్షరాస్యుడు అయిన పక్షంలో వారికి లీగల్ విట్‌నెస్ సహాయం అందించాల్సి ఉంటంది. తన సమ్మతిని తెలియచేస్తున్నట్లుగా ఆడియోవిజువల్ రికార్డింగ్‌కూడా ఫార్మా కంపెనీలు చేయాల్సి ఉంటుంది. కాని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రాష్ట్రం పరిధిలోని ఔషధ నియంత్రణ సంస్థలకు కూడా ముందస్తు సమాచారం ఇచ్చే విధానాన్ని కేంద్రం ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి.