తెలంగాణ

సమన్వయంతో పని చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే బల్కంపేట ఎల్లమ్మ ఆలయానికి వచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో మల్టీ లెవెల్ ఫంక్షన్ హాలు నిర్మాణానికి జిహెచ్‌ఎంసి, రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహారించాలని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
బుధవారం ఆయన సనత్‌నగర్ నియోజకవర్గంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో సమీక్షించారు.
రాంగోపాల్‌పేట డివిజన్‌లోని కలాసిగూడ నాలాలో సుమారు 5 కిలో మీటర్ల మేర పూడికతీత పనులను ఏడాది క్రితం ప్రారంభించగా, ఇప్పటి వరకు కేవలం 1.4 కిలో మీటర్లు మాత్రమే పని చేయడం ఏమిటని మంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనిపై సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. అమీర్‌పేటలో 50 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టేందుకు చర్యలు చేపట్టాలని, సనత్‌నగర్ రిజర్వాయర్ నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని, కిమ్స్ వద్ద బిటి రోడ్డు, పిజి రోడ్డు హనుమాన్ ఆలయం వద్ద సిసి రోడ్డు నిర్మాణ పనుల గురించి మంత్రి తలసాని ప్రశ్నించగా, రెండు, మూడు రోజుల్లో పనులు చేపట్టనున్నట్లు ఎస్‌ఇ అశ్విన్ కుమార్ వివరించారు.