తెలంగాణ

హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకించండి నేటి నుంచి మావోయస్టుల నిరసనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: హిందూ మతోన్మాదాన్ని వ్యతిరేకిస్తూ పోరాటం సాగించాలని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు భద్రాద్రి,కొత్తగూడెం-తూర్పు గోదావరి డివిజనల్ కమిటీ పిలుపునిచ్చింది. 1992 డిసెంబర్ 6న హిందూ మతోన్మాద శక్తులు బాబ్రీ మసీదును కూల్చి రెండు మతాల మధ్య చిచ్చురేపారని కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 6 నుంచి 12వ,తేదీ వరకు మతోన్మాద వ్యతిరేక, నిరసన వారోత్సవాన్ని పాటించాలని మావోయిస్టు పార్టీ బుధవారం పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పిలుపునిచ్చింది. 12న భద్రాద్రి, కొత్తగూడెం డివిజన్‌లో బంద్ పాటించాలని మావోయిస్టు పార్టీ డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ కోరారు. దేశంలో ఎక్కడ పేలుళ్లు సంభవించిన హైదరాబాద్‌ను తెరపైకి తెస్తూ, ముస్లిం యువతను అభాసుపాలు చేస్తున్నారని కమిటీ ఆరోపించింది. ముస్లింలపై హిందూమతోన్మాద శక్తులు దాడులకు పాల్పడుతోందని, హిందుత్వ అజెండా అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఒక మతాన్ని టార్గెట్ చేసుకుందని ఆరోపించింది. హిందూ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా విద్యార్థి, యువజన, కార్మిక సంఘాలు పోరాడాలని, కవులు, కళాకారులు, మేధావులు మతోన్మాదాన్ని వ్యతిరేకించాలని ఆజాద్ పిలుపునిచ్చారు.