తెలంగాణ

కేసీఆర్ సాహసం అజరామరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: అవకాశాలకు ఆకాశమే హద్దు అనే విషయాన్ని యువత గుర్తించాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా దృష్టిసారిస్తే చేరుకోలేమనే భయం అక్కర్లేదని అన్నారు. ఎస్సీవిద్యార్థులకు వృత్తి నైపుణ్యం కోసం నేక్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు పూర్తి చేసుకున్న యువత రోడ్ల మీదకు రాకుండా వారికి వృత్తి నైపుణ్యం అందించనున్నట్టు తెలిపారు. ఎస్సీ విద్యార్థులకు మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇస్తామని ఇందుకు ప్రతి విద్యార్థి పేరిట ప్రభుత్వం 44వేల రూపాయిలు ఖర్చు చేయనుందని చెప్పారు. ఎన్నో ఒత్తిడిలు ఎదురైనా విద్యారంగంలో సంస్కరణలను తీసుకొచ్చిన సాహసం సిఎం కెసిఆర్‌దేనని అన్నారు. ఒకస్థాయికి ఎదగాలంటే డబ్బు లేదనే బెంగను వీడాలని అపుడే లక్ష్యాన్ని చేరుకుంటారని అన్నారు. సత్సంకల్పంతో అడుగుముందుకు వేస్తే సంకల్పసిద్ధి సాధించవచ్చని అన్నారు. హైదరాబాద్‌లో దేశ ప్రజలు గర్వించదగ్గరీతిలో 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అంబేద్కర్ స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ ప్రజాసంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ అన్నారు. అంబేద్కర్ మహాపరినిర్వాణ్ దివస్ సందర్భంగా ట్యాంకుబండ్ వద్ద అంబేద్కర్‌విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఇందిరానగర్, విద్యానగర్ , సత్యానగర్‌లలో జరిగిన అంబేద్కర్ వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. 70 ఏళ్ల స్వాతంత్య్రంలో అట్టడుగు వర్గాల ప్రజలు కనీసం అభివృద్ధికి కూడా నోచుకోలేదని, మోదీ పాలనలో సామాన్యుడు సైతం సామాజిక, ఆర్ధిక, రాజకీయ ఫలాలను చవిచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమాల్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ నేతలు చింతా సాంబమూర్తి, వేముల అశోక్, ఎన్ గౌతమ్‌రావు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.