తెలంగాణ

కాళేశ్వరం కేసు విచారణ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 6: కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌లో దాఖలైన పిటిషన్ విచారణ జనవరి 3వ తేదీకి వాయిదా పడింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్‌తో కూడిన ధర్మాసనం ముందు బుధవారం పిటిషన్ విచారణ వచ్చింది. పిటిషనర్ తరపున న్యాయవాది సంజయ్ ఉపాధ్యాయ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ అనుమతులను ఉల్లంఘిస్తోందని, దీనిపై ఒక కమిషన్ ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన విచారణ కొనసాగించాలని కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది వెంకటరెడ్డి వాదనలు కొనసాగిస్తూ ప్రాజెక్టు రెండోదశ అటవీ అనుమతులు వచ్చాయని ట్రిబ్యునల్‌కు వివరించారు. దీంతో బెంచ్ జోక్యం చేసుకుని త్వరితగతిన ఈ కేసును విచారించాల్సిన అవసరం లేదని జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.