తెలంగాణ

పునరుద్ధరణే కాదు.. కొత్త చెరువులు కూడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 6: మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా పాత చెరువుల పునరుద్ధరణే కాకుండా కొత్తగా చెరువుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో 8 కొత్త చెరువులు, ఆదిలాబాద్ జిల్లాలో 26 కొత్త చెరువులను నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్టు నీటిపారుదలశాఖ మంత్రి టి హరీశ్‌రావు తెలిపారు. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టనున్న కొత్త చెరువుల నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులను మంత్రి ఆదేశించారు. మెదక్ జిల్లాలో చేపట్టబోయే కొత్త చెరువుల నిర్మాణం కోసం రూ. 13 కోట్ల వ్యయానికి పాలనాపరమైన ఆమోదం లభించిందని మంత్రి వెల్లడించారు. అలాగే ఆదిలాబాద్‌లో నిర్మించబోయే చెరువులకు రూ.92 కోట్ల నిధులను మంజురు చేసినట్టు మంత్రి వివరించారు. మిషన్ కాకతీయలో కొత్త చెరువుల నిర్మాణాలను చేపట్టడం ఇదే మొదటిసారని మంత్రి అన్నారు.